
Nagababu : మెగా బ్రదర్ నాగబాబు తన అన్న, తమ్ముడిని ఎవరన్నా ఏమైన అంటే అస్సలు ఊరుకోరు. ఇటు సోషల్ మీడియా ద్వారా కాని లేదంటే ఈవెంట్స్ వేదికగా విమర్శల వర్షం గుప్పిస్తుంటారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా విమర్శిస్తే.. తాట తీస్తా అంటూ హెచ్చరించారు. ఎన్నో ఆసక్తికర విషయాలను నాగబాబు పంచుకున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా గ్రాండ్ మెగా కార్నివాల్ పేరుతో ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగబాబు, హీరో శ్రీకాంత్, సాయిధరమ్ తేజ్, దిల్ రాజు లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
నాగబాబు ఫైర్..
నాగబాబు మాట్లాడుతూ 21 ఏళ్ల వయసులో కుర్రవాడిగా చిరంజీవి గారు ఇండస్ట్రీలో నటుడిగా ఎదగాలని కలగన్నారు. ఇప్పుడు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అన్నయ్య గురించి నాకంటే బాగా చెప్పేవారు ఎవరూ ఉండరు. అన్నయ్య గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అని నాగబాబు అన్నారు. ఆయన స్థాపించిన సామ్రాజ్యం వల్ల ఒక తమ్ముడిని నిర్మాత చేశారు. అంటే నేను. మరో తమ్ముడు పవన్ కళ్యాణ్ . పవన్ ముందు దర్శకుడు కావాలని కోరిక. తన ఆలోచనలని సినిమా ద్వారా చూపించాలి అని అనుకున్నాడు. కానీ అన్నయ్య మాత్రం.. నువ్వు డైరెక్టర్ కావాలంటే కాస్త ఆలస్యంగా అయినా కావచ్చు. కానీ నీలో ఒక స్పార్క్ ఉంది. ఇప్పుడు హీరోగా నటించు అని చెప్పారు.
Nagababu about Criticisms On His Brothers Chiranjeevi and Pawan Kalyan
అన్నయ్య మాట కాదనకుండా పవన్ పవర్ స్టార్ గా మీ ముందుకు వచ్చారు. అలాగే జనసేనానిగా మరి రాజకీయ చైతన్యం తీసుకువస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చబోతున్నాడు అని నాగబాబు అన్నారు. అన్నయ్య ఎంతో సాధించారు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తినే విమర్శించడమే కొందరు వ్యక్తులు, మీడియా పనిగా పెట్టుకున్నాయి. అన్నయ్యని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోలేను. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తా. నన్ను కాంట్రవర్షియల్ పర్సన్ అనుకున్నా పర్వాలేదు అని నాగబాబు అన్నారు. నా అన్నని, తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తా అని నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.