Naga Babu : పవన్ కళ్యాణ్ మా ఇంట్లో పుట్టకపోతే బాగుండేది.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!
Naga Babu : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఘన అనే వ్యక్తి రాసిన “ది రియల్ కర్మయోగి” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుండి విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అని అన్నారు. చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మంది స్నేహితులు ఉండేవారు కాదు. ఎప్పుడూ కూడా తన ప్రపంచంలో ఉండేవాడు. ఒంటరిగా ఉండేవాడు. తన గదిలో ఆట బొమ్మలతో ఆడుకుంటూ గడిపాడు. అసలు కుటుంబ సభ్యులకు అతన్ని గురించి ఏమీ అర్థం అయ్యేది కాదు. ఉన్న కొద్ది ఎదుగుతూ సినిమా రంగంలోకి రావాలనుకున్న సమయంలో.. హీరో అయ్యే పరిస్థితిల్లో అందరూ కూర్చుని మాట్లాడటం జరిగింది.
హీరో అయ్యాక సంవత్సరానికి ఎలాగా ప్లానింగ్.. ఎన్ని సినిమాలు చేస్తావని అడిగారు. దానికి కళ్యాణ్ బాబు ఇచ్చిన సమాధానం అందరికీ చిరాకు అనిపించింది. నేను ఎలా పడితే అలా సినిమాలు చేయను. క్వాలిటీ సినిమాలు చేస్తాను అని అన్నాడు. కళ్యాణ్ బాబు అప్పుడేం చెప్పాడో ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నాడు. కళ్యాణ్ బాబుది ఎప్పుడు మారని వ్యక్తిత్వం. నిజంగా అతనికి డబ్బు అంటే లెక్క ఉండదు. ఎదుట వాళ్ల బాధని తన బాధగా ఎంచుకునే మనస్తత్వం. ఎక్కువ సేవాగుణం కలిగిన వ్యక్తి. అందువల్లే రాజకీయాల్లోకి వెళ్ళాడు. జనసేన పార్టీ స్థాపించడం కోసం తన పిల్లల పేరిట ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ ల డబ్బులను తీసుకొచ్చి పార్టీ పెట్టడం జరిగింది. రాజకీయాల్లో ఉంటే చాలా ఎక్కువ మందికి సహాయం చేయవచ్చు అన్న ఉద్దేశంతో పవన్ పార్టీ పెట్టడం జరిగింది.
నిజంగా డబ్బు గురించి గానీ బంధుత్వాలు గురించి గానీ పెద్దగా పట్టించుకోడు. సమాజం గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈ పుస్తక రచయిత ఘన.. నాకు నా తమ్ముడు పవన్ గురించి తెలిసిన విషయాలే పుస్తకంలో రాశాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక కర్మయోగి. తన సెక్యూరిటీ గురించి గానీ ఇంకా భవిష్యత్తు గురించి గానీ ఏమీ ఆలోచించడు. ఇవాల్టికి కూడా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉన్న హీరో. అయినా గాని మా తమ్ముడు అంత ఆర్థికంగా నిలబడిన వ్యక్తి కాదు. పవన్ నటించిన ఏదైనా సినిమా హిట్ అయిన… వెళ్లి ప్రశంసించాలని అనుకున్న గాని.. అతడు పెద్దగా పొంగిపోడు. ఎవరైనా తిట్టినా పొగిడిన పెద్దగా పట్టించుకోడు. దేనిని మనసులోకి తీసుకోడు.
ఇక ఇదే సమయంలో పవన్ రాజకీయపరంగా సమాజంలో వెళ్లినప్పుడు ప్రజల నుండి రెండు విషయాలు గమనించాను. ఒకటి తమ సమస్యలు చెప్పుకోవడానికి వేచి ఉండే ప్రజలు. మరొకరు మనస్ఫూర్తిగా అభిమానించేవారు. నిజంగా పవన్ కళ్యాణ్ “ది రియల్ కర్మయోగి” అంటూ…అసలు ఇటువంటి వ్యక్తి మా ఇంట్లో ఎందుకు పుట్టాడో..పుట్టకపోతే బాగుండేది అని చాలాసార్లు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ లా ఉండాలని అనుకున్నాను. కానీ కుటుంబంలో అతను ఉన్నాడుగా అని ఆలోచనలు విరమించుకున్నాను. అతనిలా బతకడం ఎవరి వల్ల కాదు. పవన్ గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కని చెబితే తమ్ముడు కదా… అనుకుంటారు..అందుకే పెద్దగా మాట్లాడను..అని నాగబాబు తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.