nagababu reveals the fact of niharika account
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈ అమ్మడు సోషల్ మీడియాతో పాటు వెండితెరపై తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఎదిగాలన్న ఆశలతో నటిగా నిహారిక ఎంట్రీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి చెందిన స్టార్ హీరోలు అరడజను పైగా ఉన్న పరిశ్రమలో నిహారిక స్టార్ హీరోయిన్ కావడం పెద్ద విషయం కాదు. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయం దృష్టిలో ఉంచుకొని వారు ఆమెను ప్రోత్సహించలేదు. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు నటించారు.
ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. మెగా ఫ్యామిలీ తలచుకుంటే ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేయడం విషయం కాదు. మరోవైపు మెగా డై హార్డ్ ఫ్యాన్స్ కి నిహారిక హీరోయిన్ కావడం అసలు ఇష్టం లేదు.మెగా డాటర్ నిహారిక కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి నిహారిక ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేయడంతో పలు రూమర్స్ తెర పైకి వచ్చాయి. సమ్‌థింగ్ ఏదో జరిగి ఉంటుందంటూ నెటిజన్లు దీనిపై చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటివరకూ దీనిపై నిహారిక స్పందించకపోవడంతో..
nagababu reveals the fact of niharika account
ఈ వ్యవహారంపై పలు రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మెగా బ్రదర్, నిహారిక తండ్రి నాగబాబు ఈ వ్యవహారంపై స్పందించారు.’నిజానికి నేనే కోడింగ్ నేర్చుకొని అకౌంట్ హ్యక్ చేసి అకౌంట్ డియాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని అకౌంట్ రీ యాక్టివ్ చేస్తాను’ అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్‌ని డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు. మరి దీనిపై నిహారిక ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.