Nagarjuna : బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ షో ఆసక్తికరంగా సాగుతుంది. 17 మంది సభ్యులతో షో మొదలు కాగా, ఈ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిని రేపుతుంది. ఈ వారం ఊహించని విధంగా తేజస్వి ఎలిమినేట్ అయింది. స్రవంతి ఎలిమినేట్ అవుతుందని అందరు భావించగా, తేజస్వినిని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. ఐదో వారంలో బిందు మాధవి, యాంకర్ శివ, అరియనా, మిత్రా శర్మ, అనిల్ రాథోడ్, తేజస్వి, స్రవంతి నామినేషన్స్ లో ఉన్నారు. చివరి వరకు లాస్ట్ పొజిషన్ లో మిత్రా శర్మ, తేజస్వి ఉండగా అంతా మిత్రా శర్మ లేదంటే స్రవంతి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ వారం తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయింది.అయితే ఆదివారం ఎపిసోడ్‌లోనాగార్జున తెగ సందడి చేశారు.
బృందావనంలో కృష్ణుడు వచ్చాడే.. అంటూ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోగ్గాడి తరహాలో ట్రెడిషనల్ లుక్ లోకి వచ్చిన కింగ్ నాగార్జున అందరిని ఒక ఆటాడుకున్నారు. అషు రెడ్డి ఆట తొక్క, తోటకురా అంటూ వాటినే చూపించడం షాక్ ఇచ్చింది. అషు రెడ్డి కూడా సరదాగా నవ్వుకుంది. అందరిని ఇమిటేట్ చేసిన నాగార్జున ముందుగా నటరాజ్ మాస్టర్ ఛాతీ ముందుకు పెట్టుకొని నడుస్తున్న విధానాన్ని హైలెట్ చేశారు. నటరాజ్ మాస్టర్ కూడా చాలా సరదాగా నవ్వుకున్నాడు. ఇక ఆ తరువాత యాంకర్ శివ హామీదా మెడలో ఏదో గొలుసు లాంటిది వేస్తూ మళ్ళీ తీసేస్తాను లే అంటూ జవాబిచ్చాడు. దానిపై కూడా నాగార్జున కౌంటర్ వేశారు.ఇక అఖిల్ విషయంలో నాగార్జున కాస్త సీరియస్ గానే స్పందించాడు.
అరియానా బోనులోకి వచ్చి మాట్లాడిన తరువాతనే నువ్వు కేసు గెలిచావు అని.. మరి అరియానా ఎవరి సైడ్ ఉందని ప్రశ్నించాడు. ఇక అరియానా కూడా ఆ రోజు ఒక విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది అజయ్ గురించి ప్రస్తావిస్తూ నాగార్జున ఎవరు ఊహించని డైలాగ్ కొట్టాడు.. వ్వాట్ ద F* గేమ్.. అంటూ ఎలాంటి ఆట ఆడుతున్నావు అనే డైలాగ్ ను గుర్తు చేశారు. నాగార్జున అలా అనడం అజయ్ కు షాక్ తగిలనట్లయ్యింది. ఇక గేమ్ ఆడకుండా ఎందుకు ఎదుస్తున్నావు? హౌస్ లో నుంచి వెళ్లిపోవాలని ఉందా అని నాగార్జున మిత్ర శర్మను ప్రశ్నించాడు.ఏదేమైన ఈ వారం ఒకవైపు సందడి చేస్తూనే మరోవైపు హౌజ్‌మేట్స్‌కి చురకలు అంటించాడు నాగార్జున.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.