Health Benefits : పల్లెలు, గ్రామాల్లో పెరిగిన ప్రతీ ఒక్కరికి ఉత్తరేణి మొక్క తెలుసు. దాని వల్ల కలిగే లాభాల గురించి కూడా కనీస అవగాహన ఉండే ఉంటుంది. అయితే పట్టణాల్లో ఉండే వాళ్లకు మాత్రం అంటే చాలా ఎక్కువ మందికి దీని వల్ల కల్గే ప్రయోజనాల గురించి తెలియదు. మన భారత దేశ ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి కొన్ని వందల రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లతో సహా అన్నింటిని ఆయుర్వేద మందుల తయారీల్లో, వైద్యంలో ఉపయోగిస్తుంటారు. అయితే ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శరీరంలో వచ్చే గడ్డలను తగ్గించుకోవచ్చట. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకుల్లో ఉత్తరేణి ఒకటి. ఉత్తరేణి ఆకులు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. శరీరంపై వచ్చే దురద, పొక్కులు, పొట్టుకు చెక్ పెట్టేందుకు చాలా మంది ఉత్తరేణి ఆకుల రసాన్నివాడుతుంటారు. అంతే కాదండోయ్ ఉబ్బసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను మంటల్లో వేసి ఈ పొగను పీల్చితే… ఈ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయట. అలాగే ఉత్తరేణి ఆకుల బూడిదను ఆముదంతో కలిపి దురద, గజ్జి, తామరపై లేపనంలా రాస్తే క్రమంగా తగ్గిపోతుంది. కందిరీగలు, తేనెటీగలు మరియు తేల్లు కరిచినప్పుడు ఈ ఆకులను నలిపి పసరు పూయడం వల్ల నొప్పి మరియు దురద తగ్గుతుంది.
అంతే కాకుండా పంటి నొప్పి తీవ్రంగా ఉంటే… ఉత్తరేమి గింజల పొడి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కలిపి ముద్ద చేసి… ఆ పేస్టును పంటిపై రాస్తే పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్త స్రావం ఆగుతుంది. శరీరంలోని కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్టపై రాసుకోవాలి. అలాగే శరీరంలో కొవ్వు గడ్డలు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా దంచి ఆకుల పేస్టును కొవ్వు గడ్డలపై పెట్టాలి. ఆ తర్వాత దానిపై బ్యాండేజీ వేయాలి. ఒక రాత్రంతా అలాగే ఉంటి మరుసటి రోజు శభ్ర పరుచుకోవాలి. ఇలా కనీసం రెండు మూడ్రోజులు చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. వీటి రసాన్ని అప్లై చేయడం వల్ల ఎక్కడైనా చర్మ సమస్యలు వచ్చినా నయమైపోతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.