
nagarjuna responds first time after samantha divorce on her health
Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుసు కదా. తను టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రస్తుతం కోలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా ఉంది. తన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా.. తన సినిమా కెరీర్ మాత్రం చాలా బాగుంది. కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ పోతూనే ఉంది. నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఆ వ్యవహారం టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అని అందరూ అనుకున్న కొన్ని రోజులకే ఇద్దరూ విడాకులు తీసుకొని దూరమయ్యారు. ఇంట్లోని పెద్దలు కూడా వాళ్ల పెళ్లి విషయంలో అడ్డు చెప్పలేదు..
అలాగే వాళ్ల విడాకుల విషయంలో కూడా అడ్డు చెప్పలేదు. విడాకుల తర్వాత నాగార్జున ఫ్యామిలీ కూడా ఏనాడూ సమంత గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఆమె టాపిక్ నే తీసుకురాలేదు. కానీ.. తాజాగా తనకు ఒక అరుదైన వ్యాధి సోకిందని, దాని పేరు మయోసైటిస్ అంటూ సమంత ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తన వ్యాధి గురించి ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది సమంత. మయోసైటిస్ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి. కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది. తొందరగా అలసిపోవడం, ఆయాసపడటం, స్పృహ తప్పి పడిపోవడం లాంటివి జరుగుతాయి. ఆమె వ్యాధి గురించి తెలియగానే అందరూ తను త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
nagarjuna responds first time after samantha divorce on her health
ఈనేపథ్యంలో సమంత వ్యాధి గురించి అక్కినేని అఖిల్ కూడా గెట్ వెల్ సూన్ సామ్ అంటూ మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంతకు సపోర్ట్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కష్ట సమయంలో అక్కినేని ఫ్యామిలీ ఎలా అందరికీ సపోర్ట్ గా నిలుస్తుందో సమంతకు కూడా సపోర్ట్ గా నిలవాలని కోరుతున్నారు. అలాగే.. నాగార్జున కూడా సమంతకు పర్సనల్ గా ఫోన్ లో మెసేజ్ చేశారట. త్వరగా కోలుకోవాలని ఆమెకు గెట్ వెల్ సూన్ అని మెసేజ్ పెట్టారట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా సమంతకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికైనా మద్దతు లభించింది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.