Bigg Boss 5 Telugu : నీతులు ఎందుకు చెప్తావ్.. యాంకర్ రవి పరువుదీసిన నాగ్
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో రవి ఆడే ఆట కాస్త వెరైటీగా ఉంటుంది.ఎవరు ఏం చేయాలి.. ఎలా మాట్లాడాలో కూడా రవిని డైరెక్ట్ చేస్తుంటాడు.బయట హోస్టింగ్‌లు చేసి లోపల కూడా అదే అలవాటు అయినట్టుంది. అలా రవి అందరికీ అవసరం లేని నీతులు చెప్పడం, సలహాలు ఇవ్వడంపై ఇంట్లోని సభ్యులు తిరగబడుతున్నారు. అందులో ముఖ్యంగా షన్ను అయితే తెగ ఫీలవుతున్నాడు. అందుకే అన్నా అంటూ మొదటి వారంలో తిరిగిన షన్ను ఇప్పుడు రవిని దూరంగా పెడుతున్నాడు.
Nagarjuna Satires On Anchor Ravi In Bigg Boss 5 Telugu
నువ్ నన్ను ప్రభావితం చేస్తున్నావ్.. నాతో మాట్లాడకు అంటూ రవికి పలు మార్లు షన్ను చెప్పాడు. కానీ రవి మాత్రం అందరికీ ఉచిత సలహాలు ఇస్తుంటాడు. ఇదే విషయంపై నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లో కడిగిపాడేశాడు. ఏమయ్యా రవి.. ఎవరు ఎలా ఆడాలో నువ్వే చెప్తావ్ నీ గేమ్ ప్లాన్ ఏంటి? అవసరం లేని వాళ్లకి కూడా అడ్వైజ్‌లు ఇస్తావ్.. ఎందుకు నీతులు ఎందుకు చెప్తావ్ అని అడిగాడు నాగ్. ఎప్పుడు సార్ అని తిరిగి రవి ప్రశ్నించాడు.
యాంకర్ రవి పరువుదీసిన నాగ్ :
Nagarjuna Satires On Anchor Ravi In Bigg Boss 5 Telugu
ఎప్పుడు ఎవరు అని కాదు.. నువ్ అందరికీ ఇస్తుంటావ్.. అలా నీతులు చెప్పడం వెనుకున్న నీ స్ట్రాటజీ ఏంటి? అని రవి పరువు తీసాడు నాగ్. ఇక రాజుగా గెలిచిన అనంతరం కెప్టెన్సీ కంటెండెర్స్‌గా అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని గెలవాలని అనుకున్నావా? అంటూ నిలదీశాడు. అలాంటిదేమీ లేదని, అందుకే తాను త్యాగం చేసి ప్రియకు ఇవ్వాలని చూశాను.. కానీ హమీద త్యాగం చేసిందని రవి అన్నాడు. అయినా కూడా చివరకు ఆ టాస్క్ వదిలేశానని రవి చెప్పుకొచ్చాడు.
