Nagarjuna : పిల్లల విషయంలో ఇంకోసారి అలాంటి తప్పు చేయకూడదని డిసైడ్ అయిన నాగార్జున
Nagarjuna : అక్కినేని నాగార్జున తన తండ్రి వారసత్వంతో నటుడిగా ఎదిగి టాలీవుడ్ మన్మథుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న నాగార్జున పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనేక విమర్శలు పొందాడు. తన వైవాహిక జీవితంలో ఓ సారి ఆటుపోట్లు ఎదురు కాగా, రెండో సారి అమలని పెళ్లి చేసుకొని సుఖంగానే ఉన్నాడు. కాని పిల్లల పరిస్థితి ఇప్పుడు ఆయనను కలవర పెడుతుంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన బిడ్డల భవిష్యత్తు విషయంలో ప్రతి దానికి కూడా కొన్ని కలలు ఉండడం సర్వసాధారణం. ఇందుకు నాగార్జున మినహాయింపు కాదు.. తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తుపై ఎంతో దిగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్నారు. వంద కోట్ల క్లబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మన అక్కినేని హీరోలు మాత్రం ఇంకా 50 ,60 కోట్ల దగ్గరే ఉండిపోవడం అత్యంత బాధాకరం. కనీసం వ్యక్తిగత జీవితం అయినా బాగుందా అంటే నాగచైతన్య తన భార్య సమంత కు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతుంటే.. చిన్నవాడు అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బ్రేకప్ తీసుకొని తన కాలాన్ని ఏదో అలా వెళ్లదీస్తున్నాడు. ఈ ఇద్దరిని చూసి నాగార్జున మనో వేదన చెందుతున్నట్టు తెలుస్తుంది.

nagarjuna thinks some different
Nagarjuna : నాగార్జున సరికొత్త ఆలోచనలు..
నాగార్జున త్వరలోనే తన పిల్లలకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. చైతన్యకు ఇంకా అఫీషియల్ గా విడాకులు రాలేదు కాబట్టి ప్రస్తుతం పెళ్లి అంటే అది చట్ట బద్ధం గా నేరం. అందుకే చిన్న కోడలు పిల్లను తీసుకురావడానికి వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఇండస్ట్రీ పిల్లలను సెలెక్ట్ చేసుకుని పొరపాటు చేశాను ఇకపై ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిలను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు నాగార్జున. మరోసారి తన పిల్లల జీవితంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.