Nageshwar rao : అప్పుడే చనిపోతానని చెప్పిన ఏఎన్ఆర్.. షాకింగ్ విషయాలు చెప్పిన శ్రియ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nageshwar rao : అప్పుడే చనిపోతానని చెప్పిన ఏఎన్ఆర్.. షాకింగ్ విషయాలు చెప్పిన శ్రియ..

 Authored By mallesh | The Telugu News | Updated on :10 December 2021,5:00 pm

Nageshwar rao : టాలీవుడ్ ముందు తరం యాక్టర్స్‌లో ముందు వరుసలో ఉంటాడు అక్కినేని నాగేశ్వర్‌రావు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనది స్పెషల్ ప్లేస్. ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా విరాజిలిన యాక్టర్ ఆయన. క్యారెక్టర్ ఏదైనా సరే అందులో ఆయన జీవిస్తారు. అందువల్లే అనేక అవార్డ్స్ ఆయనకు దాసోహమయ్యాయి. ఆయన డైలాగ్స్ ఇప్పటికీ చాలా మంది నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఆయన యాక్ట్ చేసిన ప్రేమాభిషేకం మూవీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా అందులోని నా కళ్లు చెబుతున్నాయి అనే పాట ఇప్పటికీ వింటూనే ఉంటాం. దేవదాసు మూవీని చాలా మంది ఇప్పటికీ ఇష్టపడుతుంటారు.

ఇలా ఆడియన్స్ కు హత్తుకునే మూవీస్ చాలానే చేశారు. ఎన్ని హిట్ ఫిలిమ్స్ చేసిన ఆయన చివరగా మనం మూవీలో యాక్ట్ చేశారు. ఇందులో తన కొడుకు, మనవళ్లతో కలిసి యాక్ట్ చేశారు. ఈ విషయం గురించి హీరోయిన్ శ్రియ ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. న్యూ డైరెక్టర్ సుజనారావు డైరెక్షన్‌లో గమనం అనే మూవీలో యాక్ట్ చేస్తోంది శ్రియ. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో ఆమె మచ్చటించారు. ఇదే సందర్భంగా నాగేశ్వర్ రావు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. అక్కినేని నాగేశ్వర్‌రావు చాలా గొప్ప యాక్టర్ అని చెప్పుకొచ్చింది శ్రియ.

nageshwar rao mentioned earlier about death

nageshwar rao mentioned earlier about death

Nageshwar rao : అలా మూవీ చేసిన తర్వాతే..

అలాంటి యాక్టర్ సినీ ఇండస్ట్రీలో ఎవరూ ఉండరని కొనియాడింది. ఆయనతో కలిసి మనం మూవీలో నటించింది ఈ ముద్దుగుమ్మ.. ఏఎన్ఆర్.. తనకు తరచూ ఓ మాట చెబుతుండే వాడని చెప్పింది. నా ఫ్యామిలీతో కలిసి నేను మూవీ చేసిన తర్వాతే చనిపోతానని.. అప్పటి వరకు నా యాక్టింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టనని ఆయన శ్రియతో చెప్పేవారట. మనం మూవీ పూర్తయాక తాను చనిపోతానని తనతో ఏఎన్‌ఆర్ చెప్పారని చెప్పుకొచ్చింద శ్రియ.. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రస్తుతం గమనం మూవీ ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది శ్రియ.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది