Mokshagana : మోక్ష‌జ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అంద‌రిలో అనేక సందేహాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mokshagana : మోక్ష‌జ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అంద‌రిలో అనేక సందేహాలు..!

Mokshagana  : నందమూరి అభిమానులు.. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఇండ‌స్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది. డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Mokshagana : మోక్ష‌జ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అంద‌రిలో అనేక సందేహాలు..!

Mokshagana  : నందమూరి అభిమానులు.. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఇండ‌స్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మోక్షజ్ఞ ఎంట్రీకీ రంగం సిద్ధమైందని తెలుస్తోంది. డెబ్యూ మూవీ గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రాలేదు కానీ మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు

Mokshagana ఎన్టీఆర్‌కి చెక్ ప‌డుతుందా ?

మోక్షజ్ఞ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నటుడిగా అన్ని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డం, కెరీర్ ఉంటుంది. ఎంతటి వారసత్వం, అభిమాన గణం ఉన్నా…. కొంత కాలం మాత్రమే నెట్టుకు రాగలడు. టాలెంట్ నిరూపించుకున్న నాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జెండా పాతుతాడు. లుక్ పరంగా మోక్షజ్ఞ పర్లేదు. మరి నటన, డాన్సులు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాల్సి ఉంది. అయితే మోక్ష‌జ్ఞ క్లిక్ అయితే తార‌క్‌కి కాస్త ఇబ్బందే. కెరీర్ మొదట్లో తెలుగుదేశం పార్టీ తనను భుజానికెత్తుకుంది. త‌ర్వాత త‌ర్వాత మ‌నోడు చాలా దూరంగా ఉంటున్నాడు.

Mokshagana మోక్ష‌జ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా అంద‌రిలో అనేక సందేహాలు

Mokshagana : మోక్ష‌జ్ఞ ఎంట్రీతో నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోతుందా.. అంద‌రిలో అనేక సందేహాలు..!

చంద్ర‌బాబు జైలుకి వెళ్లిన‌ప్పుడు, ఇత‌ర సంద‌ర్భ‌ల‌లో ఎన్టీఆర్ స‌రిగా స్పందించ‌కపోవ‌డంపై టీడీపీ శ్రేణులు ఆయ‌న‌పై భ‌గ్గుమంటున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా బాలయ్యవైపే ఉన్నారు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ అడుగు పెట్టగానే అతన్ని ఆకాశానికి ఎత్తే అవ‌కాశం ఉంది. రాను రాను తారక్ ను మాత్రం దూరం పెడతారనే అర్థమవుతోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబంలోని ఇతర సభ్యులతో తారక్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు. మోక్షజ్ఞ అడుగుపెడితే ఎన్టీఆర్ కు ఇప్పుడు కాస్తో కూస్తో ఉన్న టీడీపీ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుందని కొంద‌రు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది