nandamuri heroes craze increased what is the reason
Nandamuri Heroes : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా ఆస్కార్ రేంజ్ కు వెళ్లిపోయింది. దీంతో ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు.. పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. మరోవైపు నందమూరి బాలయ్య బాబు.. అఖండ, వీరసింహారెడ్డి హిట్లతో మాంచి జోరుమీదున్నాడు. ఇంకోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బింబిసార సక్సెస్ తో మాంచి ఊపు మీదున్నాడు. మొత్తానికి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు పెద్ద హీరోలు సూపర్ డూపర్ హిట్లతో తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు.
కానీ.. ఈ ముగ్గురు హీరోలు ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అయితే చాలా బాధలు పడ్డారు. అతనొక్కడే తర్వాత ఆయనకు సరైన హిటే పడలేదు. కొన్ని ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పటాస్ ద్వారా మరో హిట్ దక్కింది కళ్యాణ్ రామ్ కు. ఆ తర్వాత బింబిసార గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బింబిసారతో తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం నందమూరి హీరోలు పట్టిందల్లా బంగారం అవుతోంది. యమదొంగ సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ కు అసలు సరైన హిట్ పడలేదు. చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.
nandamuri heroes craze increased what is the reason
దీంతో ఇక అందరూ ఎన్టీఆర్ పని అయిపోయింది అన్నారు. కానీ.. పడిలేచిన కెరటంలా జూనియర్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. వరుసగా హిట్లు కొడుతూ తన టెంపర్ చూపించాడు. టెంపర్ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా చివరకు ఆర్ఆర్ఆర్ ద్వారా ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. అలాగే.. బాలయ్య బాబు కూడా ఒకప్పుడు హిట్ల కోసం ఎంతో వెయిట్ చేశాడు. చివరకు డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొడుతూ తనకు ఇంకా క్రేజ్ ఉందని నిరూపించుకున్నాడు బాలయ్య. ఒకప్పుడు వీళ్ల జాతకం బాగోలేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ.. ఇప్పుడు వీళ్లు పట్టిందల్లా బంగారం అవుతోంది. వీళ్ల జాతకాలు మారాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.