Inspirational News : ఇది టెక్నాలజీ యుగం. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలకు కూడా సమాన హక్కులు కల్పిస్తుండటంతో మహిళలు బాగా రాణిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుటుంబ పోషణ కోసం మెకానిక్ గా మారింది. రోజంతా దుమ్ము దూళిలో పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న మెకానిక్ షాపులో ఈ మహిళ పని చేస్తుంది.
ఈమె పేరు రాధ. ఈమెను అందరూ అక్కడ మెకానిక్ రాధ అని పిలుస్తుంటారు. రాధకు 16 ఏళ్ల కింద వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలాసకు వలస వచ్చిన రాధ కుటుంబం.. ఏదో ఒక పని చేయడం కోసం ఆమె భర్త మెకానిక్ షాపు పెట్టాడు. కానీ.. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేక మెకానిక్ షాపు సరిగ్గా నడవలేదు. అలాగే.. కరోనా కూడా రావడంతో రాధ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కుంది. కోవిడ్ తో షాపులన్నీ మూసేయడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ఏదో ఒకటి చేయాలని..
తన ఫ్యామిలీని పోషించుకోవాలని తనే మెకానిక్ షాపు ఓపెన్ చేసి మెకానిక్ గా మారాలని అనుకుంది. రోజూ మెకానిక్ షాపునకు వెళ్లి అక్కడ మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలు పెట్టింది. భర్త కూడా తనకు సాయం చేశాడు. రిపేరింగ్ ఎలా చేయాలో నేర్పించాడు. దీంతో తన భర్తతో పాటు రాధ కూడా మెకానిక్ గా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చాలామంది మహిళ మెకానిక్ గా చేయడం ఏంటని పెదవి విరిచినా అవన్నీ పట్టించుకోకుండా తన కుటుంబం కోసం మెకానిక్ గా మారి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న రాధను చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.