Kalyan Ram : కళ్యాణ్ రామ్‌ చేసిన ఆ వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్‌ కు కౌంటర్‌ అయ్యి ఉంటాయి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalyan Ram : కళ్యాణ్ రామ్‌ చేసిన ఆ వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్‌ కు కౌంటర్‌ అయ్యి ఉంటాయి!

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,9:00 pm

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా బింబిసార ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కళ్యాణ్రామ్ మీడియాతో మాట్లాడాడు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటాడు. ఒక జర్నలిస్టు మీరు తెలుగుదేశం పార్టీలో కి వెళ్ళిబోతున్నారా, అక్కడ క్రియాశీలకంగా ఉంటారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాల పైనే ఉంది అంటూ కళ్యాణ్ రామ్‌ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ రెండు పడవల ప్రయాణం అనేది అస్సలు సరి కాదని పేర్కొన్నారు.

ఒకవేళ తాను రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయితే కచ్చితంగా సినిమాలను మానేస్తానని, రెండు పడవల ప్రయాణం చెయ్యను అంటూ ఆయన తెగేసి చెప్పాడు. కళ్యాణ్‌ రామ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని విమర్శించినట్లుగా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ వ్యవహారాల తో బిజీ బిజీగా ఉన్నా కూడా సినిమాలు చేస్తాను అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. సినిమాలకు సరైన డేట్లు ఇవ్వలేక దర్శకులను వెయిటింగ్ లో ఉంచి చివరకు వారితో సినిమాలు చెయ్యలేదని అంటూ తెగ చెప్తున్నాడు.

Nandamuri Kalyan Ram comments about Pawan kalyan politics and movies

Nandamuri Kalyan Ram comments about Pawan kalyan politics and movies

దాంతో వారు సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత మరో సినిమాను చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిణామాలు పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం వల్లే జరుగుతుందని కళ్యాణ్రామ్ అభిప్రాయం కావచ్చు. అందుకే తాను అలాంటి ప్రయాణం చేయను అనుకుంటున్నాడు. ఆ కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కళ్యాణ్ రామ్‌ ఆ వ్యాఖ్యలు అన్నాడో లేదో కానీ ఆ వ్యాఖ్యలు మాత్రం సరైనవే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది