Mokshagna Teja : మోక్షజ్ఞ సరసన ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్
ప్రధానాంశాలు:
Mokshagna Teja : మోక్షజ్ఞ సరసన ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్
Mokshagna Teja : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల మోక్షజ్ఞ సరసన శ్రీలీల నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
![Mokshagna Teja మోక్షజ్ఞ సరసన ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Mokshagna-Teja.jpg)
Mokshagna Teja : మోక్షజ్ఞ సరసన ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్
Mokshagna Teja మోక్షజ్ఞ సినిమాలో ఈ హీరోయిన్ ఓకే
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అభిమానులు మోక్షజ్ఞ సినిమాలో మీనాక్షి చౌదరిని meenakshi chaudhary పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబో అదిరిపోతుందంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకుందని.. మోక్షజ్ఞ సరసన మీనాక్షి చౌదరి అయితే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటారు. తన తనయుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్న బాలకృష్ణ.. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.