Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్‌కు మనీ ఎంత వస్తుందో తెలుసా?
Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది. ఈ క్రమంలోనే ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రమోషన్స్ జోరుగా సా..గుతున్నాయి. స్పెషల్ గెస్టుల మధ్య ఈ ఎపిసోడ్ జరగనుంది. ఇక ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులూ ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సారి అనగా ఎపిసోడ్ ఫైవ్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో మీకు తెలుసా.. కటింగ్స్ అన్నీపోనూ విన్నర్‌కు ఎంత మనీ అందుతుందంటే..టాప్ 5 కంటెస్టెంట్స్‌లో సిరి, మానస్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 3లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ ఉన్నారు. ఇక వీరిలో సన్నీ విన్నర్ అయ్యాడని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది.ఈ విషయం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు దాచేయాలని నిర్వాహకలు ప్రయత్నించారు.
కానీ, అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. షణ్ముక్ జస్వంత్ చివరి వరకూ పోటీలో వచ్చినా ఓటింగ్‌లో మాత్రం సన్నీని దాటుకుని ముందుకు వెళ్లలేకపోయాడు. సిరి టాప్ ఫైవ్‌లో నిలిచింది. కానీ, ఇంకా ముందుకు రాలేకపోయింది. కాగా, టైటిల్ విన్నర్‌కు ఈ సారి స్టార్ మా యాజమాన్యం ఊహించని విధంగా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నదని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.ఈ సీజన్ విజేతకు ఎప్పటి మాదిరిగానే అనగా గత సీజన్స్‌కు ఉన్నట్లుగానే ఈ సీజన్ విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే, గత సీజన్స్‌లో ప్రైజ్ మనీ కాస్త తక్కువే ఇచ్చారు. ఇక ఈ సారి మాత్రం ప్రైజ్ మనీతో పాటు 300 స్క్వేర్ ఫీట్స్ గల ఫ్లాట్ కూడా ఇవ్వనున్నారు.
Bigg Boss 5 Telugu : జోరుగా ప్రమోషన్స్..
ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, ‘బిగ్ బాస్’ హోస్ట్ నాగార్జున తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్‌కు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు ఇచ్చినప్పటికీ అందులో కటింగ్స్ చాలానే ఉంటాయి. అవన్నీ పోనూ చివరికి రూ.15 లక్షలు మాత్రమే వస్తాయని తెలుస్తోంది. రియాలిటీ షో లో గెలుచుకున్న మనీకి కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని సమాచారం. ఇకపోతే ఇప్పటికే అందుతున్న సమచారాం ప్రకారం.. సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఫ్లాట్ కూడా దక్కనుందట.. చూడాలి మరి.. ఏమవుతుందో.. సన్నీకి ప్రైజ్ మనీ, ఫ్లాట్ కాకుండా రెమ్యునరేషన్ కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ‘బిగ్ బాస్’ పుణ్యమాని సన్నీకి రూ.కోటి వచ్చే చాన్సెస్ ఉన్నాయి.