Nani : పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని రాజమౌళి ముందు చెప్పి అందరి మనసులు గెలుచుకున్న నాని
ప్రధానాంశాలు:
Nani : పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని రాజమౌళి ముందు చెప్పి అందరి మనసులు గెలుచుకున్న నాని
Nani : నేచురల్ స్టార్ నాని హిట్ 3 ’ ప్రమోషన్ ఓ రేంజ్‌లో సాగుతుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గెస్ట్‌గా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో శ్రీనిధిశెట్టి కథానాయిక. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ ప్రాంచైజీలో ఇది మూడో సినిమా. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మించిన ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

Nani : పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని రాజమౌళి ముందు చెప్పి అందరి మనసులు గెలుచుకున్న నాని
Nani నాని క్యూట్ స్పీచ్..
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా వచ్చిన రాజమౌళి సందడి చేశారు. అయితే రాజమౌళి ముందు నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశం. ఫుల్ ఎఫర్ట్ పెట్టాం. మంచి హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం అందరిలో ఉంది. కళ్యాణ్ గారి స్టైల్‌లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది అని నాని డైలాగ్ పేల్చాడు. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లింది.
నాని నోటి నుండి పవన్ కళ్యాణ్ డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోని తెగ వైరల్ కూడా చేస్తున్నారు. మరోవైపు నా వెనుక రాజమౌళి ఉన్నారు.. నా ముందు అభిమానులు మీరున్నారు.. కడుపులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది.. అంటూ నాని చేసిన కామెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
నా వెనుక రాజమౌళి ఉన్నారు..
నా ముందు అభిమానులు మీరున్నారు..
కడుపులో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది..పవన్ కళ్యాణ్ గారి స్టైల్‌లో చెప్పాలంటే.. మనల్ని ఎవడ్రా ఆపేది?!#HIT3 #Nani #SrinidhiShetty #SaileshKolanu #Rajamouli pic.twitter.com/KKkXqwhWlx
— Filmy Focus (@FilmyFocus) April 27, 2025