Nani | నాని ఫేవ‌రేట్ టీచ‌ర్ ఎవ‌రు.. ఆయ‌న గురించి ఆమె ఏమ‌ని చెప్పారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nani | నాని ఫేవ‌రేట్ టీచ‌ర్ ఎవ‌రు.. ఆయ‌న గురించి ఆమె ఏమ‌ని చెప్పారంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 August 2025,2:00 pm

Nani | టాలెంటెడ్ నటుడిగా ఎదిగిన న్యాచురల్ స్టార్ నాని తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు గెస్ట్‌గా హాజరైన నాని, తన బాల్యాన్ని, విద్యా జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. హైదరాబాద్‌లోని సెయింట్ ఆల్ఫాన్స్ స్కూల్ లో చదివిన నాని, తనకు ఎంతో ఇష్టమైన టీచర్ సుందరమ్మ గురించీ మాట్లాడాడు. నేను ఏవరీజ్ స్టూడెంట్‌నే. కానీ సుందరమ్మ మేడమ్ నన్ను చాలా కేర్ చేసేవారు.

#image_title

నాని టీచ‌ర‌మ్మ‌..

ఎగ్జామ్ టైంలో ఇంటికి ఫోన్ చేసి కూడా నేను చదువుతున్నానా లేదా అని తెలుసుకునేవారు” అని నాని చెప్పాడు. ఇంతలో టీమ్, నాని చెప్తున్న ఆ సుందరమ్మ టీచర్‌ను స్టేజీపైకి తీసుకురావడంతో, నాని షాక్ అయ్యాడు. సంవత్సరం క్రితం అనుకోకుండా కలిశాను. మళ్లీ ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది” అని భావోద్వేగంగా స్పందించాడు.సుందరమ్మ మేడమ్, చిన్నప్పటి నానిని గుర్తుచేస్తూ .. “క్లాస్‌లో నిద్రపోయేవాడు. అల్లరి పెద్దగా చేసేవాడు కాదు. చాలా సైలెంట్‌గా ఉండేవాడు. హోమ్‌వర్క్ చేయకుండా వచ్చేవాడు.

కానీ పదో తరగతిలో వేసిన ఓ స్కిట్‌లో పెళ్లికూతురు తండ్రి పాత్ర చేశాడు. ఆ స్కిట్‌కి డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ నానియే చేశాడు. అప్పుడే ఇతనిలో టాలెంట్ ఉందని మాకు తెలిసింది” అని చెప్పారు.అలాగే యాంకర్ ప్రదీప్, శర్వానంద్ కూడా తమ స్కూల్ స్టూడెంట్సే అని తెలిపారు. ఈ సందర్భంగా టీచర్, నానికి తాను బోధించిన క్లాస్‌తో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను గిఫ్ట్‌గా అందించారు. నాని వెంటనే తన టీచర్ పాదాలకు నమస్కరించి, “మళ్లీ త్వరలో ఇంటికి వస్తాను మేడమ్” అని హమ్మయ్యగా చెప్పారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది