Nani : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. నాని సినిమాలో వేశ్య‌గా క‌నిపించనున్న హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nani : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. నాని సినిమాలో వేశ్య‌గా క‌నిపించనున్న హీరోయిన్

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Nani : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. నాని సినిమాలో వేశ్య‌గా క‌నిపించనున్న హీరోయిన్

Nani : వెండితెరపై తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘హిట్ 3’ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇప్పుడు ది ప్యారడైజ్, the paradise Movie అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్‌ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

Nani ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌ నాని సినిమాలో వేశ్య‌గా క‌నిపించనున్న హీరోయిన్

Nani : ఇదెక్క‌డి ట్విస్ట్ రా మామ‌.. నాని సినిమాలో వేశ్య‌గా క‌నిపించనున్న హీరోయిన్

Nani : ఇలా ఎందుకు?

నాని ఈ సినిమాలో మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ స్పష్టంగా వినిపిస్తోంది.ఈ సినిమాలో నానికి జోడీగా భాగ్యశ్రీ బోర్సే మరియు కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించనున్నారని సమాచారం. ఇందులో కాయాదు kayadu lohar  పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పాత్ర గురించి అధికారిక క్లారిటీ ఇంకా రానప్పటికీ, సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఇందులో చాలా ఢిఫ‌రెంట్‌గా క‌నిపించ‌నుంద‌ట ఈ ముద్దుగుమ్మ‌.

ఇక బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో నాని కెరీర్ ఇప్పుడు బిజీ మోడ్‌లో ఉంది. ఒకవైపు హిట్ ఫ్రాంచైజీలో విజయం సాధిస్తూనే, మరోవైపు మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. నాని అభిమానులు ఇప్పుడు మరో పక్క ఈ సినిమాలోని కథ, పాత్రలపై అధికారిక అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది