Nara Rohith : టాలీవుడ్‌లో కొందరు హీరోలు లేటు వయస్సులో పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నారా రోహిత్ చేరాడు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాణం’ అనే సినిమాతో ఇండస్ట్రీపై గురిపెట్టిన ఆయన సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు. ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన 2018 తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు.
ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రోహిత్. ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నారా వారి అబ్బాయి నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరిగింది. నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వచ్చాయి. కట్ చేస్తే ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇరువురి కుటుంబ పెద్దలు డిసెంబర్ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. కాగా.. ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.. బాణంలా సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి ప్రతి మూవీ సెలక్షన్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రోహిత్.. పెళ్లి విషయంలోనూ బాగా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి తన మనసుకు నచ్చిన ప్రతినిధిగా శిరీష చెయ్యి పట్టుకుని ఏడడుగులు వెయ్యబోతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.