Nagarjuna : నాగార్జున పేరు చెప్ప‌గానే సుర్రుమ‌ని లేచిన నారాయ‌ణ‌.. ఆయ‌న అంటే అస‌హ్యం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : నాగార్జున పేరు చెప్ప‌గానే సుర్రుమ‌ని లేచిన నారాయ‌ణ‌.. ఆయ‌న అంటే అస‌హ్యం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 February 2022,5:00 pm

Nagarjuna : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ స‌మాజంలో జ‌రిగే ప‌లు విష‌యాల‌పై త‌నదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. బిగ్ బాస్‌పై ఆయ‌న ప‌లుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. షో తో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలతో చెలరేగారు. బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసారు. ఈ షో పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని విమర్శించారు. షో చూస్తుంటే కావాలని కోట్లాటలు..అనైతిక విధానాలతో షో కొనసాగుతోందని మండిపడ్డారు.ఈ షోకి ప్ర‌భుత్వాలు ఎలా అనుమ‌తులు ఇస్తున్నాయంటూ కూడా గ‌తంలో ఆయ‌న మండిప‌డ్డారు.

తాజాగా నారాయ‌ణ బిగ్ బాస్ షోపై త‌న‌దైన కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కారు. తాజాగా సిపిఐ నారాయణ ఓ ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ పై, నాగార్జునపై మ‌రోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అమ్మాయి తో డేటింగ్ చేస్తావు…. ఏ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటావు… ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అంటూ నాగార్జున ప్రశ్నలు వేస్తారు. అనేదే బిగ్ బాస్ షోనా…. నాగార్జున ఇంట్లో కూడా ఆడ వాళ్ళు ఉన్నారు కదా అంటూ కామెంట్ చేశాడు.తనకు నాగార్జున అంటే కోపం కాదని అసహ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి ఇలా తయారయ్యారేంటీ?

narayana fire on nagarjuna

narayana fire on nagarjuna

Nagarjuna : బిగ్ బాస్‌పై ఫైర్..

అని ఆర్కే అడిగిన ప్రశ్నకు `ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు.. తెగిపోయిన చెప్పులు వేసుకోవాలి. గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కయ్యూనిస్టు అంటారు. కానీ అది భ్రమ. చినజీయర్ స్వామి మొదలుకుని రకరకాల వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్పేవారున్నారని బదులిచ్చారు సీపీఐ నారాయణ. అసలు కమ్యూనిస్టులు అంటే ఇప్పటి తరానికి ఎవరు అనే పరిస్థితి వచ్చింది. అయితే అసలు సిసలైన కమ్యునిస్టులెవరు..? వాళ్లు ఎలా ఉండాలి..? అనే విషయాలు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు సీపీఐ నేత నారాయణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది