Pavitra Lokesh : బాబోయ్ ఈ గొడవలన్నీ నాకు వద్దు అంటూ నరేష్ ను వదిలేసిన పవిత్ర లోకేష్
Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేష్ ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లుగా ఇటీవలే కొత్త సంవత్సరం సందర్భంగా అధికారికంగా ప్రకటించాడు. ఇంతలో ఏమయిందో కానీ నరేష్ మరియు పవిత్ర లోకేష్ దూరం అయ్యారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నరేష్ ఇప్పటి వరకు తన మూడవ భార్య రమ్య రఘుపతి నుండి విడాకులు పొందలేక పోయాడు. రమ్య రఘుపతి యొక్క కుమారుడు తల్లిదండ్రి కలిసి ఉండాలని కోరుకుంటున్నాడట.
naresh and pavitra lokesh breakup rumors
దాంతో కోర్టు ఇద్దరికీ విడాకులు ఇచ్చే విషయమై ఆచితూచి వ్యవహరిస్తుందని తెలుస్తోంది.ఇప్పటికే విడాకులు మంజూరు అవ్వాల్సి ఉన్నా కూడా రమ్య రఘుపతి తన కొడుకు యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కోర్టులో ఆందోళన వ్యక్తం చేసిందట. అందుకే విడాకుల విషయం ఆలస్యం అవుతుందని, అసలు విడాకులు వస్తాయో లేదో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నరేష్ మరో వైపు తనకు ప్రాణ హాని ఉందని ఇటీవలే రమ్య రఘుపతి సుఫారీ ఇచ్చి తనను హత్య చేయించేందుకు ప్రయత్నించిందని సంచలన ఆరోపణలు చేశాడు.
naresh and pavitra lokesh breakup rumors
కోర్టు ముందుకు కూడా ఆ విషయాన్ని తీసుకు వెళ్లాడు. కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్ తో తన హత్య కి కుట్ర చేస్తుందని నరేష్ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు రమ్య రఘుపతి స్పందించలేదు. మరో వైపు నరేష్ పై హత్య కుట్ర మరియు విడాకులు ఇంకా రాక పోవడంతో పవిత్ర లోకేష్ తిరిగి బెంగళూరు వెళ్ళి పోయిందని, నరేష్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతుంది. అయితే నరేష్ మాత్రం పవిత్ర మరియు తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా మళ్లీ ప్రకటించాడు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
