Pushpa 2 Movie : ‘పుష్ప 2’తో నష్టాలు వచ్చాయా.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అంత పెద్ద బాంబ్ పేల్చాడేంటి ?
ప్రధానాంశాలు:
Pushpa 2 Movie : ‘పుష్ప 2’తో నష్టాలు వచ్చాయా.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అంత పెద్ద బాంబ్ పేల్చాడేంటి ?
Pushpa 2 Movie : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా జనవరి 23తో 50 రోజులు పూర్తి చేసుకుంది. రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రూ.2000 కోట్లకు చేరువై ఉంటుందని అంతా భావిస్తున్నారు. సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి చాలా ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంతా భావిస్తున్నారు.తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది…
అయితే పుష్ప2కి సంబంధించి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించలేదని బాంబ్ పేల్చాడు . నిర్మాతలు, ఫైనాన్సియర్స్, దర్శకుల ఇళ్లలో ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నట్టికుమార్ పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడారు.ఆంధ్రాలో పుష్ప 2 డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. లాభాలు ఎవరికీ రాలేదు. కొన్ని చోట్ల అయితే అసలు సినిమా డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఎవరూ తీసుకోలేదు. ఆ విషయం నాకు తెలుసు. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆంధ్రాలో కాలేదు. నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. కేరళలో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇవన్నీ నిజాలు, అబద్దాలు కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నట్టికుమార్. మరి ఇది నిజమా కాదా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
కాగా పుష్ప 2 సినిమా గురించి నట్టి కుమార్ తొలి నుంచి నెగిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. పుష్ప 2కి వచ్చిన కలెక్షన్ల.. అల్లు అర్జున్‌కి వచ్చిన క్రేజ్‌ని చూసి తట్టుకోలేకనే అతడు అలా మాట్లాడి ఉంటాడని కొందరు అంటున్నారు. అసలు ఆయన టాలెంట్ ఏంటో ముందు చర్చించుకోవాలని కొందరు చెబుతున్నమాట. ఇక పుష్ప2 విషయానికి వస్తే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.