Natural Star Nani : జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పై ఫన్నీ కామెంట్స్ చేసిన నాని..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Natural Star Nani : జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పై ఫన్నీ కామెంట్స్ చేసిన నాని..!!

Natural Star Nani : తెలుగు పరిశ్రమలో నాచురల్ స్టార్ గా నాని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తూ తన ఏంటో నిరూపించుకుంటున్నాడు. ఇక తాజాగా నాని ‘ హాయ్ నాన్న ‘ సినిమా చేశారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచారం జోరును పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ గా వ్యవహరించిన […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 November 2023,5:30 pm

Natural Star Nani : తెలుగు పరిశ్రమలో నాచురల్ స్టార్ గా నాని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తూ తన ఏంటో నిరూపించుకుంటున్నాడు. ఇక తాజాగా నాని ‘ హాయ్ నాన్న ‘ సినిమా చేశారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచారం జోరును పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ గా వ్యవహరించిన ఓ ఇంటర్వ్యూకి నాని, ఈ సినిమాలో నటించిన పాప కియారా ఖన్నా హాజరయ్యాడు. సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే ప్రమోషన్ లో భాగంగా సుమ నానితో సరదాగా ఓ ఆట ఆడించారు. హీరోల కొడుకుల చిన్నప్పటి ఫోటోలు చూపించి వాళ్లెవరో చెప్పాలని అన్నారు. ఈ క్రమంలో నే జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటో చూపించారు. మొదట నాని గుర్తుపట్ట లేకపోయినా కొద్దిసేపటి తర్వాత తారక్ చిన్న కొడుకా అని అన్నారు. అవును అని సుమ అన్నారు. తారక్ చిన్ను కొడుకు చాలా కచ్చి అని నాని అన్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. హిందీలో హాయ్ పాపా పేరుతో మిగతా భాషల్లో ఆయా ప్రాంతీయంగా ఏమి పిలుస్తారో, అదే టైటిల్తో విడుదల చేస్తున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్ లో చూపించారు.

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. అందులో మృణాల్ ఠాకూర్ క్యూట్ లుక్స్ తో ఫిదా చేశారు. ఈ సినిమాలో చిన్నారిగా నటించిన పాప పేరు కియారా. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటున్నారు. జెర్సీ సినిమాలో తండ్రి తనయుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కితే ఇప్పుడు చేస్తున్ హాయ్ నాన్న సినిమా మాత్రం తండ్రీ కూతుర్ల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ గ్లింప్స్ కూడా ఎంతో ఎమోషనల్తో కూడింది. మొత్తానికి నాని తనకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సబ్జెక్టుతో వస్తున్నాడు.

 

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది