Nayanathara : న‌య‌న‌తార పెళ్లి వేదిక మార్పు.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ కార్డ్

Authored By Sam C | The Telugu News | Published on: May 29, 2022, 12:00 pm

Nayanathara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన న‌య‌న‌తార కొద్ది రోజులుగా పెళ్లి వార్త‌ల‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. శింబు, ప్ర‌భుదేవాల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లికి సిద్ధ‌మైంది. ప్రస్తుతం ఈ జంట తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. జూన్‌ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.

ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్‌ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌’ని కూడా ఈ జంట పంపించినట్లు తెలుస్తోంది. ఆ వీడియో ఇన్విటేషన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పత్రిక ప్రకారం నయన-విఘ్నేష్‌ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. నయనతార పెళ్లి తిరుపతిలో అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్‌ స్పష్టం చేస్తోంది. పెళ్లి కార్డుపై ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్‌ చేసిన డిజిటల్‌ ఇన్విటేషన్‌ కార్డ్‌ అందరనీ ఆకట్టుకుంటుంది.

Nayanathara marriage date fixed

Nayanathara marriage date fixed

Nayanathara : న‌య‌న్ పెళ్లి ముచ్చ‌ట‌..!

కార్డు అదిరిందని అభిమానులు, బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు.నయన్ ఇప్పటికే రెండు సార్లు పెళ్లివరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నయనతార.. తమిళ్ హీరో శింభు మధ్య లవ్ ఎఫైర్ నడిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ప్రభుదేవతో కూడా నయన్ రిలేషన్ షిప్ కొన్నాళ్లు నడిచింది. వీరిద్దరీ మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు విఘ్నేశ్‌‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఈ లేడీ సూపర్ స్టార్.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతోంది. మ‌రి ఈ బంధం ఎన్నాళ్లు సాఫీగా సాగుతుందో అనేది చూడాలి.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp