Tanya Ravichandran : నయనతార చెల్లెలు డబ్బులోనే కాదు చదువులోనూ సూపరే..!
Tanya Ravichandran : తాన్యా రవిచంద్రన్.. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ పేరు తెగ వైరల్ అవుతోంది. ఈ నటి రీసెంట్‌గా సినిమాల్లో నటించడం ప్రారంభించింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. తమిళ ప్రజలకు తాన్యా రవిచంద్రన్ కొత్త ఏమి కాదు. ఈమె తమిళ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్ మనువరాలు. తన తాత బ్యాగ్రౌండ్ మీద ఇండస్ట్రీలోకి వచ్చిన తాన్యా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో నటనకు గాను తాన్యాకు అభిమానులు కూడా బాగానే అయ్యారు.
2016లో ‘బల్లే వెళ్ళైయితేవా’ అనే తమిళ్ సినిమా ద్వారా తాన్యా సినీరంగం ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇక 2021లో విడుదలైన ‘రాజా విక్రమార్క’ మూవీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తాన్యా రవిచంద్రన్ ప్రస్తుతం తమిళ్‌లో బాగా ఫేమస్ అయిన పేరు. తెలుగు ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం లేదు. నటించిన ఒకటి రెండు సినిమాలతోనే తాన్యా స్టార్ హీరోయిన్ లిస్టులో పేరు సంపాదించుకుంది.

Nayantara younger sister is not only good in money but also in studies
Tanya Ravichandran : గాడ్ ఫాదర్ మూవీతో హైలెట్..
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో తాన్యా నయన్ తార చెల్లెలి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా ఇందులో పవర్ ఫుల్ పొలిటిషిన్ రోల్ పోషించింది నయన్ తార. ఇక తాన్యా నయనతార చెల్లెలి పాత్ర పోషించి తన నటనతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఇక తాన్య వ్యక్తిగత విషయానికొస్తే ఈ బ్యూటీ కొన్ని వందల కోట్లకు వారసురాలు అని తెలిసింది. ఇక చదువు విషయానికొస్తే తాన్యా పీజీ చేసింది. ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్‌ఆర్ విభాగం తీసుకుంది.సినిమాల మీదున్న ఆసక్తితో చివరకు ఇండస్ట్రీలో అడుగుపెట్టిందట..