Nayanthara : బిగ్ న్యూస్ : జైలు కి నయనతార ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nayanthara : బిగ్ న్యూస్ : జైలు కి నయనతార ?

Nayanthara : సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దానికి పైగా అవుతున్న ఇప్పటికీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే నయనతార తమిళ్ డైరెక్ట్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలని కూడా కన్నారు. ఫ్యామిలీ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సినిమాల పరంగా కూడా అంతే […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 July 2023,6:00 pm

Nayanthara : సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దానికి పైగా అవుతున్న ఇప్పటికీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే నయనతార తమిళ్ డైరెక్ట్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలని కూడా కన్నారు. ఫ్యామిలీ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సినిమాల పరంగా కూడా అంతే సక్సెస్ గా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం నయన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ అట్లీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో నయనతార మీద ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆస్తి తగాదా కేస్ లో నయనతార ఫ్యామిలీ మీద పోలీస్ కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ తండ్రి పేరు శివ. ఆయనకు మొత్తం తొమ్మిది మంది సోదరులు ఉన్నారు. కొంతకాలం క్రింద విగ్నేష్ శివన్ తండ్రి కాలం చేశారు. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు సోదరులకు చెందిన ఆస్తిని ఎవరికి చెప్పకుండా అమ్మేశారట. ఉమ్మడి ఆస్తుల్ని ఎవరికి చెప్పకుండా విఘ్నేశ్ తండ్రి అమ్మేసి, ఆ డబ్బుల్ని తమ సొంతానికి వాడుకున్నట్లుగా పేర్కొంటూ తిరుచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు.

Nayanthara in police case

Nayanthara in police case

విగ్నేష్ శివన్ బాబాయ్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు రాసుకున్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తో పాటు ఆయన భార్య నయనతార, తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్య పైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి నయనతార తన భర్త ఆస్తి తగాదాల విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇకపోతే నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతుంది. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఆమె కెరియర్ కు ఎటువంటి ఢోకా ఉండదు. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది