Nayanthara lover gives clarity about their marriage
Nayanthara : కొన్నాళ్లుగా ప్రేములో మునిగి తేలుతున్న నయనతార ఎట్టకేలకు వైవాహ జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా ప్రేమలో విహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నయన్. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ స్టార్ కపుల్ గా మారబోతున్నారు. ఈ మేరకు గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నెల రోజుల నుంచి తమ వివాహా వేడుకకు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్బంగా పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. జూన్ 9న తమిళ నాడులోని మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఈ కోలీవుడ్ జంట ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం.
హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగనుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్. ‘నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
Nayanthara lover gives clarity about their marriage
కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపాడు విఘ్నేష్ శివన్. కోలీవుడ్ నుంచి కమల్‌హాసన్, రజినీ కాంత్, చిరంజీవి, అజిత్, విజయ్, సూర్య, కార్తీలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా పెళ్ళికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ లో జరుగుతున్న స్టార్ వెడ్డింగ్ కావడంతో వేడుకను ఓటీటీలో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేశారంట.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.