Nara Ramamurthy Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Andhra pradesh CM చంద్రబాబు నాయుడు Chandrababu Naidu Brother తమ్ముడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలియడంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక నారా రామ్మూర్తి నాయుడు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి వస్తే… 72 ఏళ్ళ రామ్మూర్తి నాయుడు… నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు రెండో కుమారుడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు. ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994 లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేసారు.
1999 ఎన్నికల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తన సొంత నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడంతో అవమాన భారంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం సైతం అనారోగ్య కారణాలు ఆయనను వెంటడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు తన సోదరుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పార్టీ బాధ్యతలు చూసేవారు.
2014లో చంద్రబాబు తిరిగి సిఎం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. రామ్మూర్తి నాయుడు అనారోగ్య దృష్ట్యా నారా రోహిత్ సినిమాలకు కూడా దూరం అయినట్లుగా చెబుతుంటారు. ఇటీవలే రోహిత్ నిశ్చితార్ధం కూడా జరిగింది. కొడుకు పెళ్లి చూడకుండానే రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన నారావారిపల్లెలో జరగనున్నాయి.
Sajjala Ramakrishna Reddy : ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ సారి దారుణంగా ఆ పార్టీ ఓడిపోవడంతో…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తుంది. ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద అక్కడ స్టార్ హీరోయిన్ నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తన ఓపెన్…
Nara Ramamurthy Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. గత…
Throat Pain : ఈ రోజుల్లో గొంతు నొప్పి అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త వాతావరణం లో మార్పు వచ్చిన…
Allu Arjun : దేశ ముదురు మూవీ desamuduru movie బన్నీ Bunny కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్. ఆ…
Belly Fat : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఈ యోగాలో ఎన్నో…
Bharat Brand : అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం 2వ దశ గోధుమ పిండి…
This website uses cookies.