Nayanthara – Vignesh : నెట్‌ఫ్లిక్స్‌లో నయన్, విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోమో.. అదిరిపోయిందిగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nayanthara – Vignesh : నెట్‌ఫ్లిక్స్‌లో నయన్, విఘ్నేష్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోమో.. అదిరిపోయిందిగా..

Nayanthara – Vignesh : సౌత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ అమ్మడు తెలుగు, కన్నడ, మళయాళం, తమిళ్ ఇండస్ట్రీల్లో వందకు పైగా సినిమాలు చేసింది.కెరీర్ మంచి రైజింగ్ దశలోనే ఈ ముద్దుగుమ్మ రెండు నుంచి మూడు ప్రేమాయణాలు నడిపింది. నయన్ రిలేషన్ షిప్ నడిపిన వారిలో యాక్టర్ శింబు, ప్రభుదేవా మెయిన్‌గా కనిపిస్తారు.రిలేషన్ షిప్‌లో ఉన్నటైంలో వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని అంతా భావించారు. కానీ ఎవరితోనూ అంది వర్కౌట్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,9:20 pm

Nayanthara – Vignesh : సౌత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ అమ్మడు తెలుగు, కన్నడ, మళయాళం, తమిళ్ ఇండస్ట్రీల్లో వందకు పైగా సినిమాలు చేసింది.కెరీర్ మంచి రైజింగ్ దశలోనే ఈ ముద్దుగుమ్మ రెండు నుంచి మూడు ప్రేమాయణాలు నడిపింది. నయన్ రిలేషన్ షిప్ నడిపిన వారిలో యాక్టర్ శింబు, ప్రభుదేవా మెయిన్‌గా కనిపిస్తారు.రిలేషన్ షిప్‌లో ఉన్నటైంలో వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని అంతా భావించారు. కానీ ఎవరితోనూ అంది వర్కౌట్ కాలేదు. చివరగా నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కమిట్ అయిన విషయం తెలిసిందే.

Nayanthara – Vignesh : నయన్, శివన్ పెళ్లి.. నెట్‌ఫ్లిక్స్‌తో బేరం

ఇటీవల వీరిద్దరూ పెళ్లిచేసుకుని ఒక్కటయ్యారు. అనంతరం తిరుమల కొండకు చేరుకుని జంటగా స్వామివారిని దర్శించుకున్నారు. నయన్ విఘ్నేశ్ పెళ్లిచేసుకున్నారని అందరికీ తెలుసు. కానీ వివాహం ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. తాజాగా వీరి మ్యారేజ్ ముందు తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వీరి వివాహానికి సంబంధించిన వీడియోను కూడా నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం చేసేలా నయన్ దంపతులు ఆ హక్కులను ఈ ఓటీటీ సంస్థతో బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇన్నిరోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్,వీడియోస్ ఎక్కడా లీక్ కాకపోవడంపై అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఎట్టకేలకు నయన-విఘ్నేశ్ శివన్ల పెళ్ళి వేడుకకు సంబంధించి అప్డేట్ విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Nayanthara Vignesh shivan pre wedding shoot plan to release by netflix

Nayanthara – Vignesh shivan pre wedding shoot plan to release by netflix

‘నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్’ పేరిట ఈ టీజర్‌ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.ఇందులో నయన్,విఘ్నేశ్‌లు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనే విషయాలను షేర్ చేసుకున్నారు. ముందుగా నయన్ మాట్లాడుతూ..తన మీద విఘ్నేశ్‌కు ఉన్న ప్రేమను ఖచ్చితంగా తెలుసుకున్నానన్నారు. ఇక విఘ్నేశ్ మాట్లాడుతూ నయనతార స్వభావంతో తాను ప్రేమలో ఉన్నానని, ఆమె క్యారెక్టర్ ఆదర్శంగా ఉంటుందని.. అందం బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఉందని వివరించారు. త్వరలోనే వీరికి పెళ్ళి కి సంబంధించిన విజువల్స్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని, దానిని చూసేందుకు ఆగలేకపోతున్నానని శివన్ తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది