
Nayanthara - Vignesh shivan pre wedding shoot plan to release by netflix
Nayanthara – Vignesh : సౌత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ అమ్మడు తెలుగు, కన్నడ, మళయాళం, తమిళ్ ఇండస్ట్రీల్లో వందకు పైగా సినిమాలు చేసింది.కెరీర్ మంచి రైజింగ్ దశలోనే ఈ ముద్దుగుమ్మ రెండు నుంచి మూడు ప్రేమాయణాలు నడిపింది. నయన్ రిలేషన్ షిప్ నడిపిన వారిలో యాక్టర్ శింబు, ప్రభుదేవా మెయిన్‌గా కనిపిస్తారు.రిలేషన్ షిప్‌లో ఉన్నటైంలో వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని అంతా భావించారు. కానీ ఎవరితోనూ అంది వర్కౌట్ కాలేదు. చివరగా నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఇటీవల వీరిద్దరూ పెళ్లిచేసుకుని ఒక్కటయ్యారు. అనంతరం తిరుమల కొండకు చేరుకుని జంటగా స్వామివారిని దర్శించుకున్నారు. నయన్ విఘ్నేశ్ పెళ్లిచేసుకున్నారని అందరికీ తెలుసు. కానీ వివాహం ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. తాజాగా వీరి మ్యారేజ్ ముందు తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వీరి వివాహానికి సంబంధించిన వీడియోను కూడా నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం చేసేలా నయన్ దంపతులు ఆ హక్కులను ఈ ఓటీటీ సంస్థతో బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇన్నిరోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్,వీడియోస్ ఎక్కడా లీక్ కాకపోవడంపై అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఎట్టకేలకు నయన-విఘ్నేశ్ శివన్ల పెళ్ళి వేడుకకు సంబంధించి అప్డేట్ విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Nayanthara – Vignesh shivan pre wedding shoot plan to release by netflix
‘నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్’ పేరిట ఈ టీజర్‌ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.ఇందులో నయన్,విఘ్నేశ్‌లు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందనే విషయాలను షేర్ చేసుకున్నారు. ముందుగా నయన్ మాట్లాడుతూ..తన మీద విఘ్నేశ్‌కు ఉన్న ప్రేమను ఖచ్చితంగా తెలుసుకున్నానన్నారు. ఇక విఘ్నేశ్ మాట్లాడుతూ నయనతార స్వభావంతో తాను ప్రేమలో ఉన్నానని, ఆమె క్యారెక్టర్ ఆదర్శంగా ఉంటుందని.. అందం బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఉందని వివరించారు. త్వరలోనే వీరికి పెళ్ళి కి సంబంధించిన విజువల్స్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని, దానిని చూసేందుకు ఆగలేకపోతున్నానని శివన్ తెలిపారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.