Home » Entertainment » Ananya Pandey Dating With These People
Entertainment

Ananya Pandey : వార్నీ.. అన‌న్య పాండే ఇంత‌మందితో డేటింగ్ చేసిందా..!

Authored By
aruna
The Telugu News | Published on: August 9, 2022, 9:40 pm
Advertisement

Ananya Pandey : సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు డేటింగ్ లాంటి యవ్వారాలు కామన్. బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఇప్పటివరకు చాలానే జరిగాయి. కొందరు ఇప్పటికీ అన్యోన్యంగా ఉంటుంటే మరికొన్ని జంటలు మాత్రం ఎవో కారణాల చేత విడిపోయారు. అయితే, డేటింగ్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా చెలామణీలో లేదని చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌తో పోలీస్తే చాలా తక్కువ.ఇక్కడ హీరోహీరోయిన్లు రిలేషన్ షిప్‌లో ఉంటే అది బయటపడేందుకు కొంత కాలం పడుతుంది. కానీ బాలీవుడ్‌లో అలా కాదు.రోజుల వ్యవధిలోనే అక్కడ డేటింగ్ యవ్వారాలు బయటకు లీవ్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ క‌ల్చ‌ర్ చాలా భిన్నంగా ఉంటుంది.అక్క‌డ హీరోయిన్లు, హీరోలు డేటింగ్ చేయ‌డం చాలా కామ‌న్. పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ పేరిట అన్నిపనులు చేసేస్తుంటారు.

Advertisement

ఇక కుర్ర హీరోలు సీనియ‌ర్ హీరోయిన్ల‌ను సైతం ప్రేమిస్తుంటారు.వ‌య‌స్సులో త‌మ‌కంటే పెద్ద‌వాళ్లైన హీరోయిన్ల‌తో రొమాన్స్‌, డేటింగ్‌లు చేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోల‌ను మ‌నం చూస్తున్నాం.ఇక పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలను పట్టించుకోకుండా భార్య‌ల‌కు విడాకులు ఇస్తూ హీరోయిన్ల‌ను పెళ్లి చేసుకునే హీరోలు కూడా ఉన్నారు. ఇక కుర్ర హీరోయిన్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.డ్రెస్ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తుంటారు. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే కూడా అదే టైప్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. ఈ అమ్మ‌డు సైజ్ జీరోతో బాలీవుడ్‌లో చాలా మంది హీరోల‌ను త‌న వెంట తిప్పుకుంటోందని టాక్.మొదట హీరో ఇషాన్ క‌త్త‌ర్‌తో ఈ బ్యూటీ చాలా రోజులు ప్రేమాయ‌ణం నడిపింది. కొంత కాలం డేటింగ్ త‌ర్వాత వీరిద్ద‌రూ గుడ్ బై చెప్పుకున్నారు.

Ananya Pandey dating with these people

Advertisement

ఆ తర్వాత అన‌న్య హీరో కార్తీక్ ఆర్య‌న్‌తో ప్రేమ‌లో ప‌డిపోయింద‌ట‌. వీరిద్దరూ చాలాకాలం డేటింగ్ చేశారు.తీరా కార్తీక్ సారా అలీఖాన్‌తో క్లోజ్‌గా ఉండటంతో వీరిద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి అన‌న్య లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో సంద‌డి చేసింది.అందులో కర‌ణ్ మాట్లాడుతూ.. నా బర్త్ డే పార్టీలో ఆదిత్యరాయ్ క‌పూర్‌తో చాలా క్లోజ్‌గా ఉన్నావ్ అంటూ బాంబు పేల్చాడు.దాంతో అన‌న్య కూడా ఆదిత్య‌రాయ్ క‌పూర్ అంటే నాకు చాలా ఇష్టం..చాలా అందంగా ఉంటాడు అంటూ ఓపెన్ అయిపోయింది. ఈ ఒక్క మాటతో ప్రస్తుతం అనన్య ఆదిత్యతో డేటింగ్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి