Neha Sharma : అలా తనను శృంగార బొమ్మగా మార్చేసినపుడు బాధపడ్డానన్న నేహశర్మ..
Neha Sharma : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలిచిత్రం ‘చిరుత’తో సినీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా శర్మకు ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. అయితే, ఆ తర్వాత కాలంలో నేహా శర్మకు టాలీవుడ్ ఆఫర్స్ పెద్దగా రాలేదు. ఈ క్రమంలోనే ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది. కాగా, ఇటీవల తన లైఫ్‌లో జరిగిన ఓ స్యాడ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఈ భామ.2018లో తన ఫొటో ఒకటి మార్ఫింగ్ చేసి కొందరు దానికి శృం.. బొమ్మను జత చేశారనికి, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అయ్యాయని తెలిపింది.
అయితే, ఆ విషయం తనకు తెలియదని, తాను రోజూ లాగానే ‘ఇల్లీగల్ ’ వెబ్ సిరీస్ షూట్‌కు వెళ్లినప్పుడు ఆ రోజంతా తనతో ఎవరు మాట్లాడలేదని బాధపడుతూ తెలిపింది నేహాశర్మ. తన గురించి గుసగుసలాడుకోవడంతో పాటు విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్న వారందరిని చూసి తాను బాధపడ్డానని వివరించింది నేహా. అయితే, ఆ క్రమంలో ఒంటిరిగా కూర్చున్న తన వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఈ విషయం తెలిపి, మార్ఫింగ్ చేసి శృం.. బొమ్మతో జత చేసిన ఫొటోను చూపించారని పేర్కొంది. అలా ఎవరు చేసి ఉంటారోనని, వాళ్లు అలా చేయడం న్యాయమేనా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది నేహాశర్మ. అలా తన ఫొటోను మార్ఫింగ్ చేసి శృంగారపు బొమ్మతో కలిపిన సమయంలో తాను చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నానని అంది నేహ.
Neha Sharma : ఆ రోజు తనతో ఎవరు మాట్లాడలేదన్న నేహ శర్మ..
ఈ సంగతులు పక్కనబెడితే.. సోషల్ మీడియాలో నేహాశర్మ చాలా యాక్టివ్‌గా ఉంటుందున్న సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. నెటిజన్లు అందరూ నేహాశర్మను సోషల్ మీడియా క్వీన్ అని పిలుస్తుంటారు. ఇకపోతే సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన నేహాశర్మ డిఫరెంట్ కంటెంట్ అందించేందుకుగాను షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లోనూ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంటుంది.