Neha Sharma : నేహా శర్మ వర్కవుట్లు.. నెటిజన్లకు ముచ్చెమటలు!
Neha Sharma : చిరుత సినిమాతో నేహా శర్మ తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే చిరుత సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఆ చిత్రం మీద పడింది. అందులోనూ ఎక్కువగా రామ్ చరణ్ మీద ఫోకస్ పెట్టేశారు. నేహా శర్మను ఎవ్వరూ పట్టించుకోలేదు. నటన పరంగా, గ్లామర్ పరంగా నేహా శర్మకు మంచి మార్కులు పడ్డా అవకాశాలు, గుర్తింపు రాలేదు.

Neha Sharma Workouts Goes Viral
అలా కుర్రాడు సినిమాతో నేహా శర్మ తన లక్ పరీక్షించుకుంది. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా వర్కవుట్ కాలేదు. అలా మొత్తానికి నేహా శర్మ టాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లింది. అయితే బాలీవుడ్‌లో మంచి బ్రేక్ కోసం కష్టపడుతోంది. మణికర్ణిక చిత్రంలో మంచి పాత్రను పోషించింది. కానీ నేహా శర్మ మాత్రం ఇంత వరకు కమర్షియల్ హీరోయిన్‌గా ఎదగలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మ దుమ్ములేపుతుంటుంది.
Neha Sharma : కష్టపడుతోన్న నేహా శర్మ

Neha Sharma Workouts Goes Viral
తన సోదరితో కలిసి నేహా శర్మ చేసే హల్చల్ మామూలుగా ఉండదు. అందాల ఆరబోతలో నేహా శర్మ, తన సోదరి ఇద్దరూ కూడా పోటీ పడుతుంటారు. తాజాగా నేహా శర్మ చేసిన వర్కవుట్లు చూస్తే ఎవ్వరైనా సరే దిమ్మతిరిగిపోవాల్సిందే. స్పోర్ట్స్ వేర్‌లో నేహా శర్మ చేసిన అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. బాడీ ఫిట్ నెస్ మీద నేహా శర్మకు ఉన్న డెడికేషన్‌ను చూసి అవాక్కవుతున్నారు. జిమ్‌లో నేహా వర్కవుట్లకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.