Malavika Mohanan : వాలంటైన్స్ డే సంద‌ర్భంగా బాయ్‌ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసిన మాళ‌విక‌.. బండ‌బూతులు తిడుతున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Malavika Mohanan : వాలంటైన్స్ డే సంద‌ర్భంగా బాయ్‌ఫ్రెండ్‌ని ప‌రిచ‌యం చేసిన మాళ‌విక‌.. బండ‌బూతులు తిడుతున్న నెటిజ‌న్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :15 February 2022,11:00 am

Malavika Mohanan : సినిమాల కన్నా సోష‌ల్ మీడియా ద్వారా ఫేమ‌స్ అయిన వాళ్లలో మాళ‌విక మోహ‌న‌న్ ఒకరు. ఈ అమ్మ‌డు ర‌జ‌నీకాంత్, విజ‌య్ సినిమాల‌లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకుంది. సోష‌ల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటారు. మాళవిక మోహనన్ ఇటీవల మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడ ఆమె దిగిన ఫోటోలు కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాను కుదిపేసాయి. టూ పీస్ దుస్తుల్లో చాలా బోల్డ్‌గా కనిపించింది ఈ కోలీవుడ్ భామ. అయితే ఇటీవ‌ల నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాల‌ని ఉందా? అయితే ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వ‌న్ మిలియ‌న్ (ప‌ది ల‌క్ష‌లు) వ్యూస్ వ‌స్తే.. ప్ర‌మాణ పూర్తిగా నా బాయ్ ఫ్రెండ్ ఎవ‌రో చెబుతాను’ అంటూ చిన్న మెలిక పెట్టింది.

మాళ‌విక నిజంగానే త‌న బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేస్తుందా అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో స్కోడా స్లావియా అనే కారు యాడ్‌ను ఆమె పోస్ట్ చేసింది. ఇదే తాను చెప్పాలనుకున్న సీక్రెట్ అంటూ చెప్పింది. ఎంత పెద్ద హ‌డావిడి చేసి ఇలా తుస్ అనిపించావు అంటూ కొంద‌రు ఫైర్ అవుతున్నారు. కొంద‌రైతే చెప్ప‌లేని బూతులు కూడా పోస్ట్‌ల‌లో పెడుతున్నారు. ఏదేమైన మాళ‌విక చేసిన ఈ హంగామా ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

netigens comments on malavika mohanan

netigens comments on malavika mohanan

Malavika Mohanan : మాళ‌వికి మ‌రీ ఇంత దారుణ‌మా..

2013లో ప‌ట్టం పోలే అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని నిర్ణ‌యాకం అనే మ‌రో మ‌లయాళ సినిమాలో యాక్ట్ చేసింది. త‌దుప‌రి నాను మ‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి అనే క‌న్న‌డ సినిమాలో సంద‌డి చేసింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన‌ పేట‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా చేసిన మాస్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. ధ‌నుష్‌తో చేసిన మార‌న్ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. ఇక‌ బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్‌, యుద్ర సినిమాల్లో న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది