Roja : బాబోయ్ ఈ దారుణాన్ని ఇక చూడలేం.. రోజాపై నెటిజన్ల సెటైర్లు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 13 October 2021, 7:59 pm

Roja : సినీ నటిగా ఓ వెలుగు వెలిగి అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది రోజా. ఆ తర్వాత రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే జబర్దస్త్ ప్రోగ్రాంతో ప్రతి ఇంట తన నవ్వుల జల్లు కురిపిస్తోంది. జబర్దస్త్ జడ్జ్‌గా రోజా తప్ప ఇంకెవ్వరూ సూట్ కాలేరు అన్నట్లుగా తనపై ముద్ర వేసుకున్న రోజా.. అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్స్‌లో మరింత జబర్దస్తీ చేస్తూ వినోదం పంచుతుంటుంది.

netizen trolls on roja shekar master on screen rmance

netizen trolls on roja shekar master on screen rmance

ఈ నేపథ్యంలోనే దసరా స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసి దానికి ‘దసరా బుల్లోళ్ళు’ అని పేరు పెట్టారు. అక్టోబర్ 15న ఈ షో ప్రసారం కానున్న సందర్భంగా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇందులో శేఖర్ మాస్టర్‌తో రోజా రొమాంటిక్ మూమెంట్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. మాయా బజార్ సినిమాను రీ- క్రియేట్ చేయడంలో భాగంగా అభిమన్యుడిగా శేఖర్ మాస్టర్, శశి రేఖగా రోజా వేషం కట్టారు.

Roja : రోజా- శేఖర్ మాస్టర్ కెమెస్ట్రీపై సెటైర్స్

netizen trolls on roja shekar master on screen rmance

netizen trolls on roja shekar master on screen rmance

ఇక ఇంకేముంది తమ రెగ్యులర్ దారిలోనే రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. మాయా బజార్ పెట్టె తెరవగానే రోజా ప్రియుడిగా శేఖర్ మాస్టర్ ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్, బాణం సంధించడం లాంటివి ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయ్యాయి. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం రోజా- శేఖర్ మాస్టర్ కెమెస్ట్రీపై సెటైర్స్ వేస్తున్నారు. బాబోయ్.. ఈ దారుణాన్ని ఇక చూడలేం అంటూ తెగ కామెంట్స్ వదులుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp