Roja : రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం..?

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  కోట్ల అవినీతి కేసులో రోజా..?

  •  వైసీపీ ఫైర్ బ్రాండ్..కటకటాలపాలవుతుందా..?

Roja : వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో మరో మాజీ మంత్రి వంతు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫైర్‌బ్రాండ్, అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాంలో రోజాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ స్కాంపై ఫిర్యాదు అందుకున్న ప్రభుత్వం, విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు నిధుల దుర్వినియోగాన్ని నిర్ధారించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని చెబుతున్నారు. దీంతో రోజాపై కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.

Roja రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం

Roja : రోజాతో అటాడేందుకు కూటమి సర్కార్ సిద్ధం..?

Roja  : ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాంలో రోజాను అరెస్ట్ చేసే ఛాన్స్…?

గత ప్రభుత్వం ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమం కింద దాదాపు రూ. 119 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో దాదాపు రూ. 100 కోట్ల మేర అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విజిలెన్స్ అధికారులు దీనిపై సుదీర్ఘ విచారణ జరిపి, అవకతవకలు నిజమేనని నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్రీడా పోటీలకు సంబంధించి పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. 45 రోజుల్లోనే రూ. 119 కోట్లు ఖర్చు చేయడంపై కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో నాటి క్రీడా మంత్రిగా ఉన్న రోజాపై అభియోగాలు మోపే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజా అరెస్టుపై పలు రకాల ప్రచారాలు జరిగాయి. అనుచిత వ్యాఖ్యల కేసులు, టీటీడీ దర్శనాల విషయంలో విమర్శలు వంటి కారణాలతో ఆమెను అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ‘ఆడుదాం-ఆంధ్ర’ స్కాం విషయంలోనే ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ స్కాంలో విజిలెన్స్ నివేదికలో ఎంత అవినీతిని గుర్తించారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది