Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో మోసం.. సామాన్యుడేడంటూ ఏకి పారేస్తున్న నెటిజ‌న్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో మోసం.. సామాన్యుడేడంటూ ఏకి పారేస్తున్న నెటిజ‌న్స్

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. భారీ అంచ‌నాల న‌డుమ సీజ‌న్ 6 తాజాగా మొద‌లైంది. కొద్ది రోజులుగా షో నిర్వాహ‌కులు చాలా అంచ‌నాలు పెంచారు. ఇందులో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం పాల్గొంటార‌ని ప్ర‌చారం చేశారు. కాని తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల జాడే లేకుండా పోయింది. తాజాగా ప్ర‌క‌టించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో . ఒక్కరు కూడా సామాన్యుడు లేడు. కీర్తిభట్, సుదీప, […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2022,8:00 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. భారీ అంచ‌నాల న‌డుమ సీజ‌న్ 6 తాజాగా మొద‌లైంది. కొద్ది రోజులుగా షో నిర్వాహ‌కులు చాలా అంచ‌నాలు పెంచారు. ఇందులో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం పాల్గొంటార‌ని ప్ర‌చారం చేశారు. కాని తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల జాడే లేకుండా పోయింది. తాజాగా ప్ర‌క‌టించిన కంటెస్టెంట్స్ లిస్ట్‌లో . ఒక్కరు కూడా సామాన్యుడు లేడు. కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్‌లో 21 మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపారు.

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ చీటింగ్..

యూట్యూబర్‌ ఆది రెడ్డిని కామనర్ అని అన్నారు హోస్ట్ నాగార్జున. ఆ త‌ర్వాత అత‌ను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు. అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్‌లోకి పంపుతూ ఎంట‌ర్‌టైన్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారే త‌ప్ప‌.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. అంటే.. కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది.

Netizens Comments On Bigg Boss 6 Telugu Commoner

Netizens Comments On Bigg Boss 6 Telugu Commoner

ఎప్ప‌టి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి ప‌లు రంగాల‌కు చెందిన సెల‌బ్స్ హాజ‌ర‌య్యారు. చివరి కంటెస్టెంట్ (21) గా బిగ్ బాస్ బాస్ ‌-6లోకి సింగర్ రేవంత్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ తో చాలా ఫన్నీగా మాట్లాడారు. నాగ్ కూడా రేవంత్ ను మంచి ప్లే బాయ్ అంటూ కామెంట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ భార్య ఆరు నెలల గర్భంతో ఉంది. ఈ సమయంలో ఆమెను వదిలి హౌజ్ లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా రేవంత్ తన భార్య పక్కన లేకపోవతున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీ పైకి రేవంత్ భార్య కూడా రావడంతో తన గుండెలకు హత్తుకొని, హౌజ్ లోకి వెళ్లాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది