Suhas – Syed Sohel : ‘ఇప్పటికైనా సుహాస్ ని చూసి నేర్చుకో.. నా సినిమా చూడండి అని ఏడవడం కాదు’.. సోహైల్ పై నెటిజన్స్ కామెంట్స్..!!

Authored By aruna | The Telugu News | Published on: February 6, 2024, 3:00 pm

Syed Sohel : గత శుక్రవారం అరడజనకు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సుహాస్ నటించిన ‘ అంబాజీపేట మ్యారేజి బ్యాండు ‘ సినిమా సక్సెస్ అందుకుంది. అయితే అదే రోజు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ నటించిన ‘ బూట్ కట్ బాలరాజు ‘ సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైనట్టు చాలామందికి తెలియదు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అయితే విడుదల రోజున షో ముగిశాక హీరో సోహెల్ థియేటర్ బయట పబ్లిక్ టాక్ బ్యాచ్ తో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర జనాలు నా సినిమాని చూడండి. నైజాం జనాలు నా సినిమాని చూడండి. రాయలసీమ జనాలు నా సినిమా చూడండి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్ సోహెల్ అని కామెంట్లు పెట్టారు కదా అన్న నా సినిమాలు ఎందుకు చూడటం లేదు.

నేను లిప్ లాకులు పెట్టుకునే అసభ్యకరమైన సినిమాలు చేయడం లేదు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాలే చేస్తున్నాను. బూట్ కట్ బాలరాజు సినిమా కూడా అలాంటిదే అంటూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోహెల్ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అసలు సోహెల్ ని హీరోగా ఎవరు సినిమాలు చేయమని అడిగారు అని ఒకరు, కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే జనాలు ఎందుకు చూడరని మరికొంతమంది ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే సోహెల్ బిగ్ బాస్ కి ముందు కూడా సినిమాలలో నటించాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జనతా గ్యారేజ్ వంటి సినిమాలలో సోహెల్ నటించాడు కానీ పెద్దగా గుర్తింపు లేని పాత్రలు అవి.

బిగ్ బాస్ తో గుర్తింపు వచ్చింది కాబట్టి సినిమాల్లో గుర్తింపు ఉండే పాత్రలు సోహెల్ చేసే అవకాశం ఉంది కానీ అతడు హీరోగా వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అది కూడా తప్పులేదు. చూడడానికి మనిషి బాగుంటాడు కానీ హీరోగా చేయాలనుకున్నప్పుడు నేను ఎక్కువగా డాన్స్ లు, ఫైట్లు చేసే పాత్రలే చేస్తాను అంటే ఎలా కుదురుతుంది. ఇక సుహాస్ మొదటి నుండి అతను కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. హీరో అంటే ఎత్తు, అందం ఉండాలి అనే ఆలోచనని కంటెంట్ తో బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. అతడు నా సినిమా చూడండి అని ఏడవట్లేదు కదా అది సోహెల్ అర్థం చేసుకోవాలి. మొదటి నుండి సోహెల్ పెద్ద ప్రాజెక్టులు చేశాడు సుహాస్ మాత్రం యూట్యూబ్ కంటెంట్ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp