Mallemala : దొరికిపోయిన మల్లెమాల టీం.. ఇంత దిగజారాలా? అంటూ ఆడేసుకుంటున్న నెటిజన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mallemala : దొరికిపోయిన మల్లెమాల టీం.. ఇంత దిగజారాలా? అంటూ ఆడేసుకుంటున్న నెటిజన్లు

Mallemala : మల్లెమాల టీం చేసే టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతీ సారి పిచ్చి వేషాలు వేస్తూ టీఆర్పీని లాగేయాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ టీఆర్పీ స్టంట్లన్నీ కూడా జనాలు పసిగడతారు. మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ డైరెక్షన్ల మీద జనాలు విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఓ ట్రిక్కే ప్లే చేశారు. దానిపై జనాలు దారుణంగా ఏకిపారేస్తున్నారు. ఈ టీఆర్పీ స్టంట్లు చాలా చూశామంటూ పోపో పోవయ్యా అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 June 2022,9:30 pm

Mallemala : మల్లెమాల టీం చేసే టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతీ సారి పిచ్చి వేషాలు వేస్తూ టీఆర్పీని లాగేయాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ టీఆర్పీ స్టంట్లన్నీ కూడా జనాలు పసిగడతారు. మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ డైరెక్షన్ల మీద జనాలు విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఓ ట్రిక్కే ప్లే చేశారు. దానిపై జనాలు దారుణంగా ఏకిపారేస్తున్నారు. ఈ టీఆర్పీ స్టంట్లు చాలా చూశామంటూ పోపో పోవయ్యా అని అంటున్నారు. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేయబోతోన్నట్టు చూపించారు. అందులో సడెన్‌గా సెట్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు.

ఇక్కడ హైపర్ ఆది ఎవరు అని అడుగుతారు. వచ్చేటప్పుడు నువ్ ఒకరికి యాక్సిడెంట్ చేశావ్.. చావు బతుకుల్లో ఉన్నాడు అంటూ హైపర్ ఆదిని సదరు పోలీసోడు భయపెట్టేస్తాడు. దీంతో అక్కడి వారంతా కూడా షాక్ అవుతారు. అయితే ఈ స్టంట్‌ను జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూట్యూబ్‌లో కామెంట్లతో మోత మోగిస్తున్నారు. ప్రోమో లాస్ట్ లో జోక్ అదిరిపోయింది పోలీస్ అన్న, పోలీస్ అన్న రూపాయికి చేయమంటే పది రూపాయలకు చేసాడు, మంచి భవిష్యత్తు ఉంది నాన్న నీకు, అది అన్నయ్య కు అసలు డ్రైవింగ్ రాదు ఆ విషయం చాలా సార్లు చెప్పాడు, … నిజంగానే ఆది ఆక్సిడెంట్ చేస్తే, ఆదిని అరెస్ట్ చేస్తే..

Netizens Fires On Mallemala Sridevi Drama Company TRP Stunts

Netizens Fires On Mallemala Sridevi Drama Company TRP Stunts

ఈ పాటికి న్యూస్ చానెల్స్ వచ్చేది, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్షన్ టీం ..?, సుధీరన్న లేకపోతే ఈటీవీ ఇన్ని టీఆర్పీ స్టెంట్స్ చెయ్యాల్సి వస్తుంది , అదే సుధీరన్న ఉంటే ఆటోమేటిక్‌గా టీఆర్పీ వస్తుంది, పోలీస్ అన్నకి సరిగా… యాక్టింగ్ నేర్పియలేదా?, పోలీస్ వారు 10రూపాయలు యాక్టింగ్ బాగా చేసారు కానీ ఆది కి డ్రైవింగ్ రాదు అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. మొత్తానికి ఇలాంటి పిచ్చి టీఆర్పీ స్టంట్లు మాత్రం ఇక మారేట్టు లేరు. వచ్చే వారం ఇంకా ఎలాంటి స్టంట్లు వేస్తారో చూడాలి. టీఆర్పీ కోసం మరింత దిగజారిపోతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి హైపర్ ఆది అరెస్ట్ అంటూ చేసిన స్టంట్ మాత్రం దారుణంగా బెడిసికొట్టేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది