Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ నుండి ఆమెను బ‌య‌ట‌కు పంపించండి మ‌హాప్ర‌భో అని వేడుకుంటున్న ప్రేక్ష‌కులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ నుండి ఆమెను బ‌య‌ట‌కు పంపించండి మ‌హాప్ర‌భో అని వేడుకుంటున్న ప్రేక్ష‌కులు

 Authored By sandeep | The Telugu News | Updated on :12 September 2022,8:00 am

Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం బిగ్ బాస్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. 21 మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ షోలో గ‌లాటా గీతూ ఎక్కువ‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. యూట్యూబర్‌గా, ఐటీ ఉద్యోగిగా, రివ్యూవర్‌గా, ఆర్జేగా, ఆర్టిస్టుగా రాణిస్తుంది గీతూ రాయల్ . సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతూ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ ఎక్కువ కాలం కొనసాగదని రాబోయే రోజుల్లో ఆమె ఎలిమినేట్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Bigg Boss 6 Telugu : బ‌య‌ట‌కు పంపిస్తాం..

కొద్ది రోజులుగా గీతూ బిగ్ బాస్ హౌజ్‌లో చేసే సంద‌డి మాములుగా లేదు. ఆమె ఏదో చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంది. అయితే గీతూ ఓవ‌రాక్ష‌న్ చూడ‌లేక ఆమెను కంటెస్టెంట్స్ జైలుకి పంపారు. అయిన ఆమె ప్ర‌వ‌ర్త‌న మార‌లేదు. దీంతో ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కి పంపేస్తామంటున్నారు. ఈ వారం అయితే నామినేష‌న్స్ లో లేదు కాబ‌ట్టి సేవ్ అయిన‌ట్టే. వ‌చ్చే వారం నామినేష‌న్స్ కి వ‌స్తే మాత్రం గీతూ క‌థ ముగిసిన‌ట్టే అని అంటున్నారు. ఆమె అతి కొంతసేపు చేస్తే బాగుంటుందని ఎక్కువ సమయం చేస్తే మాత్రం నష్టం తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో చాలామంది కంటెస్టెంట్లు సైలెంట్ అయిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Netizens Trolls On Bigg Boss 6 Telugu Lady Contestant

Netizens Trolls On Bigg Boss 6 Telugu Lady Contestant

బిగ్ బాస్ సీజన్6 ఏ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షోను నిర్వహిస్తుండగా ఈ షో వాళ్లకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్6 లో యూట్యూబర్లు, టిక్ టాక్ స్టార్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం గమనార్హం. హౌజ్‌లో ఆది రెడ్డి, గలాట గీతూ, సింగర్ రేవంత్‌ల మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. పనీ పాట లేకుండా మిగతా వారి మీద రివ్యూలు ఇస్తూ ఆదిరెడ్డి, అందరి మీద గంప నోరేసుకుని గీతూ పడిపోవడం, తన మాటే నెగ్గాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించే రేవంత్.. ఇలా అందరి మీద ఓ ముద్ర పడింది. ఇక ఇంటిని చక్కబెట్టేందుకు నాగార్జున ప్రయత్నించాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది