Home » Entertainment » New Love Track Between Sunny And Siri In Bigg Boss 5 Telugu House Going Viral In Social Media
Entertainment

Shanmukh : సన్నీ, సిరిలా మధ్య కొత్త లవ్ ట్రాక్… నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటూ ఫైర్ అయిన షణ్ముఖ్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 7, 2021, 5:00 pm
Advertisement
Shanmukh : బిగ్ బాస్ షో సీజ‌న్ 5 ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చేసింది. 19 మందితో మొదలైన ఈ షో మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. ఇదిలా ఉంటే షో చివ‌రి ద‌శ‌కు వచ్చే సరికి హౌస్ లో చిత్ర విచిత్రాలు జ‌రిగిపోతున్నాయి. మొదటి నుంచి సన్నీతో అంటి ముట్టనట్టుగా ఉన్న సిరి ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని ఆయనతో క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అది అదనుగా భావించిన మానస్, కాజల్ లు సన్నీ సిరీల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు. ఇది కాస్త షణ్ముఖ్ కోపానికి గురి చేసింది.హౌస్ బయట నుంచే తన ఫ్రెండ్ అయిన సిరితో షన్నూ మొదటి నుంచి క్లోజ్ గా మూవ్ అవుతూ వస్తున్నాడు. ఒకే బెడ్ పై పడుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ఓ కిస్సు రెండు హగ్గులతో రెచ్చి పోతున్నారు వీరు ఇద్దరు.

అయితే తాజాగా సిరి తనతో కాకుండా… మానస్, కాజల్, సన్నీలతో క్లోజ్‌గా ఉండటం షణ్ముఖ్ త‌ట్టుకోలేక‌పోయాడు. సన్నీ-సిరిల మధ్య కావాలనే మానస్ కాజల్ లవ్ ట్రాక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ తెగ ఫీల్ అయిపోయాడు. అంతటితో ఆగక సిరిని పిలిచి ఆమెని అన‌రాని మాట‌లు అన్నాడు. నువ్ ఎడ్డిదానిలాగే ఉంటున్నావ్.. నీకు అర్థం కావట్లేదా.. బ‌య‌ట బ్యాడ్ నేమ్ వ‌స్తుంది. నీ క్యారెక్ట‌ర్ బ్యాడ్‌గా వెళుతుంది. ఈ పిల్ల ఇద్దరితోనూ ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. పింకీ అయిపోయింది… ఇక ఇప్పుడు నువ్వా? అయినా నువ్వు ఏం చేస్తే నాకెందుకు…

Advertisement

new love track between sunny and siri in Bigg Boss 5 Telugu house going viral in social media

Shanmukh: సన్నీ తో సిరి కొత్త లవ్ ట్రాక్:

హౌస్ నుంచి బయటకు వెళ్తే నువ్వు ఎవరో… నేను ఎవరో అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు షణ్ముఖ్.షన్నూ మాటలకు ఒక్కసారిగా విస్తు పోయిన సిరి.. ఆ కాసేపటికి ఏదో సందర్భంలో … సన్నీని అన్నయ్యా అన్నావంటే ఏదురవనా అంటూ పాట రూపంలో అన్నయ్య అని పిలవడం కొసమెరుపు. ప్రస్తుతం హౌస్ లో ఇంకా ఆరు మంది మిగిలారు. సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి