Shanmukh : సన్నీ, సిరిలా మధ్య కొత్త లవ్ ట్రాక్… నీ క్యారెక్టర్ బ్యాడ్ అంటూ ఫైర్ అయిన షణ్ముఖ్..!
అయితే తాజాగా సిరి తనతో కాకుండా… మానస్, కాజల్, సన్నీలతో క్లోజ్‌గా ఉండటం షణ్ముఖ్ తట్టుకోలేకపోయాడు. సన్నీ-సిరిల మధ్య కావాలనే మానస్ కాజల్ లవ్ ట్రాక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ తెగ ఫీల్ అయిపోయాడు. అంతటితో ఆగక సిరిని పిలిచి ఆమెని అనరాని మాటలు అన్నాడు. నువ్ ఎడ్డిదానిలాగే ఉంటున్నావ్.. నీకు అర్థం కావట్లేదా.. బయట బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ క్యారెక్టర్ బ్యాడ్‌గా వెళుతుంది. ఈ పిల్ల ఇద్దరితోనూ ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. పింకీ అయిపోయింది… ఇక ఇప్పుడు నువ్వా? అయినా నువ్వు ఏం చేస్తే నాకెందుకు…

new love track between sunny and siri in Bigg Boss 5 Telugu house going viral in social media
హౌస్ నుంచి బయటకు వెళ్తే నువ్వు ఎవరో… నేను ఎవరో అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు షణ్ముఖ్.షన్నూ మాటలకు ఒక్కసారిగా విస్తు పోయిన సిరి.. ఆ కాసేపటికి ఏదో సందర్భంలో … సన్నీని అన్నయ్యా అన్నావంటే ఏదురవనా అంటూ పాట రూపంలో అన్నయ్య అని పిలవడం కొసమెరుపు. ప్రస్తుతం హౌస్ లో ఇంకా ఆరు మంది మిగిలారు. సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.