
Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయవద్దని నిర్మాతల కండీషన్.. నిధి అగర్వాల్ కామెంట్స్
Nidhhi Agerwal : ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా నిధి ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను నటించిన చిత్ర విశేషాలతో పాటు కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.
Nidhhi Agerwal : ఆ హీరోతో డేటింగ్ చేయవద్దని నిర్మాతల కండీషన్.. నిధి అగర్వాల్ కామెంట్స్
టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ‘మున్నా మైకేల్’ అనే బాలీవుడ్ మూవీతో తన కెరీర్ ప్రారంభం అయిందని చెప్పిన నిధికి టీమ్ కండీషన్ పెట్టిందట. . సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో పొందుపరిచారు. అందులోనే నో డేటింగ్ అనే షరతు విధించారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదని దాని అర్థం. కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు. ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను.
నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఉండొచ్చనుకుంటున్నాను. అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నాను అని నిధి అగర్వాల్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చారు. అలాగే ఆన్లైన్ ట్రోలింగ్ గురించి కూడా నిధి అగర్వాల్ మాట్లాడారు. ఈ ప్రపంచంలో మంచి, చెడు రెండూ ఉన్నాయని చెప్పారు. కేవలం మంచి మాత్రమే ఉందనడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియా కామెంట్స్ నాపై పెద్దగా ప్రభావం చూపించలేవు అని నిధి అగర్వాల్ వ్యాఖ్యానించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.