Niharika Konidela : నాగబాబు చేతిని కొరికేసిన నిహారిక.. వీడియో వైరల్

Advertisement

Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికతో ఎంత ఫన్నీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. నిహారిక చేసే అల్లరి, నాగబాబు చేసే కామెడీ నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తనకు ఎక్కువగా నిహారిక అంటేనే ఇష్టమని చెబుతుంటాడు నాగబాబు. చిన్నతనంలో నిహారిక చేసిన అల్లరి గురించి చెబుతూ మురిసిపోతుంటాడు నాగబాబు. ఓ సారి విదేశాల్లో తిరుగుతున్నప్పుడు నిహారిక మిస్ అయిందని చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అలా ఈ తండ్రీకూతుళ్ల బంధం గురించి ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.

Advertisement

చిన్నప్పుడు నిహారికకు వింత వింత అబద్దాలు చెప్పేవాడట నాగబాబు. నిహారికకు నువ్వొక స్పెషల్ అని చెప్పేవాడట. అందరూ అమ్మ కడుపులోంచి వస్తే.. నువ్ మాత్రం నా కడుపులోంచి వచ్చావ్ అని చెబుతుండేవాట. అందుకే ఈ గాట్లు పడ్డాయని తన ఒంటి మీదున్న గాట్లను నాగబాబు చూపించేవాడట. చిన్నతనంలో అది నిజమని నిహారిక నమ్మేసిందట. స్కూల్లో తనకు బయాలజీ క్లాస్ చెప్పే వరకు ఆ విషయం అబద్దమని కూడా తెలీలేదట. అలా నిహారికకు చిన్నతనంలో నాగబాబు ఆటపట్టించేవాడట.

Advertisement
Niharika Konidela bites Nagababu video viral
Niharika Konidela bites Nagababu video viral

ఇక ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా నిహారిక తెలివి ఎలా ఉందో చూపించేందుకు శాంపుల్‌గా ఓ వీడియోను షేర్ చేశాడు నాగబాబు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే సామెత అంటే ఇదేనమో అన్నట్టుగా చెప్పుకొచ్చాడు నాగబాబు. నాగబాబుకి ప్రమాదం జరిగినట్టుంది. అందులో ఓ చేయి ప్యాక్చర్ అయింది. అయితే ఆ చేతికి విపరీతంగా నొప్పి ఉందట. ఆ చేతి నొప్పి పోగొడతాను అంటూ నిహారిక పిచ్చి చేష్టలు చేసింది. ఇంకో చేతిని గట్టిగా కొరికేసింది.

దీంతో ఈ చేయి బాగా నొప్పి వేస్తుందని నాగబాబు అరిచేశాడు. అంటే ఆ నొప్పి పోయిందన్నట్టేగా అని నిహారిక లాజిక్ తీసింది. దీంతో నాగబాబు షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుళ్లు చేసిన ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి పగలబడి నవ్వేస్తున్నారు.

Advertisement
Advertisement