Niharika Konidela : మంట పెట్టిన నిహారిక‌.. బికినీలో ఇలా ర‌చ్చ చేస్తుందేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika Konidela : మంట పెట్టిన నిహారిక‌.. బికినీలో ఇలా ర‌చ్చ చేస్తుందేంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :13 October 2022,5:00 pm

Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా వ‌చ్చిన నిహారిక ఒక్క‌టంటే ఒక్క సినిమాతోను అల‌రించ‌లేక‌పోయింది. ప‌లు ఈటీవీ షోలకు హోస్ట్ వ్యవహరించి , ఆ క్రేజ్ తో వెబ్ సిరీస్‌లను నిర్మించిన నిహారిక ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా అయితే నిహారికకు మంచి గుర్తింపును అందించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఇక హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటించింది. 2019లో సూర్యకాంతం అనే సినిమాల్లో కూడా ఆమె మంచి పాత్ర పోషించింది. నిహారిక చివరగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మందే వ‌చ్చిన నటీమణులు మాత్రం ఒక్కరే. మెగా డాటర్ నిహారిక మాత్రమే నటిగా రాణిస్తోంది. నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. అయితే ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. నిహారిక ఇటీవల టర్కీకి తన ఫ్రెండ్స్ తో కలసి హాలిడే ట్రిప్ వెళ్ళింది. టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఇలా అక్కడ ఒక స్ట్రేంజర్ గర్ల్ తో బికినీలో సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇలోన. నువ్వు మాట్లాడింది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ నీతో ఉన్నంతసేపు సరదాగా అనిపించింది.

Niharika Konidela new post controversy

Niharika Konidela new post controversy

Niharika Konidela : దారుణాతి దారుణం..

మళ్ళీ కలుస్తామేమో చూద్దాం’ అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతా బాగానే ఉంది కాని నిహారిక వేసుకున్న బికినీ ఫొటోనే ప్ర‌తి ఒక్క‌రికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ ప‌రువు ఎందుకు తీస్తున్నావు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్త‌న్నారు. మధ్యన నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది. అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం పార్టీ కోసమే వెళ్లిందని.. పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. అప్ప‌టి నుండి నిహారిక సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది