Niharika Konidela : వర్ష ఇమాన్యుయేల్‌ల పరువుతీసిన మెగా డాటర్.. రైల్వే ట్రాక్ అంటు కామెంట్ చేసిన నిహారిక

Authored By aruna | The Telugu News | Published on: August 22, 2022, 12:40 pm

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక బుల్లితెరపై కనిపించి చాలా రోజులే అయింది. ఎందుకంటే తన వెబ్ సిరీస్‌లతో నిహారిక ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఆ మధ్య ఒక సారి బుల్లితెరపైకి వచ్చింది. కానీ అది జీ తెలుగు చానెల్ చేసిన ఓ ఈవెంట్ కోసం. నిహారిక బుల్లితెర కెరీర్ మొదలైంది మాత్రం మల్లెమాల ద్వారానే. ఢీ షో కోసం నిహారిక మొదట యాంకర్‌గా మారింది. కెమెరా భయాన్ని అక్కడే తొలగించుకుంది నిహారిక. అయితే నిహారిక ఈటీవీ షోల్లో బాగానే కనిపించింది. కాకపోతే నాగబాబు బయటకు వెళ్లిన తరువాత నిహారిక కూడా ఇటు వైపు మొహం కూడా చూపించలేదు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ నిహారిక మల్లెమాల షోల్లో కనిపించింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు నిహారిక వచ్చింది.

తన వెబ్ సిరీస్ హలో వరల్డ్‌ను ప్రమోట్ చేసుకుంది. అయితే ఈక్రమంలో నిహారిక మళ్లీ తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీసింది. స్టేజ్ మీద స్కిట్ వేసింది. అందరి మీద వరుసగా పంచులు వేస్తూ పరువుతీసేసింది. అందరి మీద పంచులు వేసి.. స్కిట్లో డైలాగ్స్ ఇవ్వని ఆదికే చుక్కలు చూపించింది నిహారిక. ఆమె వేసిన పంచులకు ఆది సైలెంట్ అయిపోయాడు. స్కిట్ మొత్తం అలానే ఉన్నాడు. అయితే బుల్లెట్ భాస్కర్‌ను ఆఫీస్ బాయ్ అనడం, రాకెట్ రాఘవను ఐశ్వర్యను తాత మనవరాలుగా చేయడం, నరేష్‌ను రిమోట్ అంత లేవు.. నువ్ ప్రమోట్ చేస్తావా? అని అనడం అన్నీ అదిరిపోయాయి. అయితే వర్ష ఇమాన్యుయేల్ మీద మాత్రం దారుణంగా సెటైర్లు వేసింది.

Niharika on Varsha emmanuel in Sridevi Drama Company Skit

Niharika on Varsha emmanuel in Sridevi Drama Company Skit

నడుచుకుంటూ వచ్చిన ఇమాన్యుయేల్‌కు మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ అనే పాట వేశారు. వీడ్ని చూస్తే మీకే ఏ యాంగిల్‌లో ముద్దొచ్చింది అని ఆది అంటాడు. ఆ తరువాత ఇమాన్యుయేల్ మాట్లాడుతూ.. మేడం మీరు నాది వర్షది లవ్ ట్రాక్ చూస్తున్నారా? అని అడుగుతాడు. అరేయ్.. నేను ఖాళీగా ఉంటే.. రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీ లవ్ ట్రాక్ మాత్రం అస్సలు చూడను అంటుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. వాళ్ల లవ్ ట్రాక్ నడిచేది కూడా రైల్వే ట్రాక్ మీదనే అని ఆది ఇంకాస్త పరువుతీస్తాడు. అలా మొత్తానికి ఈ స్కిట్లో మాత్రం నిహారిక అందరి మీద పంచులు వేసేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp