Niharika : నిహారిక న్యూ లుక్.. డ్ర‌గ్స్ కేసు త‌ర్వాత తొలిసారి బ‌య‌ట‌కు..!

Authored By Sam C | The Telugu News | Published on: April 26, 2022, 10:00 am

Niharika: మెగా బ్ర‌దర్ నిహారిక ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈవెంట్‌లో తెగ సంద‌డి చేసింది. అయితే పెళ్లైన త‌ర్వాత నిహారిక హంగామా త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ‌కూడా చేసింది.

కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ నుండి త‌ప్పుకొని షాకిచ్చిన నిహారిక రీసెంట్‌గా ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో దొర‌క‌డంతో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా లో ఆమెపై ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. అయితే నిహారిక డ్రగ్స్ తీసుకోలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే.డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డినప్ప‌టి నుండి నిహారిక ఎవ‌రికి క‌న‌బ‌డ‌కుండా గృహ నిర్భందంలో ఉంది. బయట కానీ, సోషల్ మీడియాలో కనై కనిపించింది లేదు. ఇక తాజాగా నిహారిక లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి., జిమ్ లో కసరత్తులు చేస్తూ.. స్నేహితుడితో ఫోజులు ఇచ్చింది మెగా డాటర్. అయితే ఈ ఫోటోలలో నిహారిక లో మార్పు కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. షార్ట్ హెయిర్, చిక్కిపోయిన ముఖం..

niharika new looks in Viral

niharika new looks in Viral

Niharika : నిహారిక షాకింగ్ లుక్..

బక్కచిక్కిన దేహం తో అస్సలు గుర్తుపట్టలేకుండా కనిపించింది. ఇది చూసి అంద‌రు అవాక్క‌వుతున్నారు.నిహారిక టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఆర్టిస్ట్, హీరోయిన్ గా, నిర్మాతగా ఇలా బిజీ సెలబ్రిటీగా అయింది నిహారిక. సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకున్నా కూడా నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో మెప్పించిన నిహా త్వరలోనే మరో వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp