Sreedevi Drama Company : ఏప్రిల్‌ 24 శ్రీదేవి డ్రామా కంపెనీ రివ్యూ… ఈసారి కూడా నవ్వించారు ఏడిపించారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreedevi Drama Company : ఏప్రిల్‌ 24 శ్రీదేవి డ్రామా కంపెనీ రివ్యూ… ఈసారి కూడా నవ్వించారు ఏడిపించారు

 Authored By prabhas | The Telugu News | Updated on :25 April 2022,8:30 pm

Sreedevi Drama Company : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గతంలో మాదిరిగా రేటింగ్ దక్కించుకోలేక పోతుంది. కానీ ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కి మంచి రేటింగ్ నమోదు అవుతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో టెలికాస్ట్ అవుతున్న ఈ కార్యక్రమం కు వస్తున్న ఆదరణ నేపథ్యంలో వారం వారం సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత మూడు నాలుగు వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా హైపర్ ఆది కనిపించలేదు. ఆయన ఈటీవీ మల్లెమాలను వదిలేసినట్లు దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. హైపర్ ఆది లేకపోయినా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కామెడీ కొదవ లేకుండా రాంప్రసాద్ చేశాడు అనడంలో సందేహం లేదు.

ఇక సుడిగాలి సుదీర్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అన్ని విధాలుగా కామెడీ పండించే నూకరాజు, పంచ్‌ ప్రసాద్‌, ఇమాన్యూల్‌ లు తమదైన ప్రయత్నాలు చేసి ఆకట్టుకున్నారు. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ మరో సారి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా చేశారు అనడంలో ఎలాంటి అనుమానం అక్కర లేదు. ఈ వారం స్పెషల్ గా సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనే కాన్సెప్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ లో అమ్మమ్మ గా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు నటించారు.ఆమె కనిపించే ప్రతి ఎపిసోడ్‌ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

etv mallemala sreedevi drama company latest episode review

etv mallemala sreedevi drama company latest episode review

కనుక సెంటిమెంట్తో ఈ ఎపిసోడ్లో కూడా ఆమెను నటింప జేయడం వల్ల మంచి విజయాన్ని ఎంటర్టైన్మెంట్ని ఇచ్చి సొంతం చేసుకుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్, ఎంటర్ టైన్ మెంట్ మరియు యాక్షన్ అని గతంలో నిరూపితమైంది. ఈ ఎపిసోడ్‌ లో కూడా తండ్రి అనే ఒక ఎమోషనల్ పాయింట్ ను తీసుకొచ్చి ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు. అన్నపూర్ణ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించే అనడంలో సందేహం లేదు. నవ్వించడం తో పాటు కన్నీళ్లు పెట్టించిన శ్రీదేవి డ్రామా కంపెనీ తాజాగా ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది