Niharika : భర్తతో కలిసి నిహారిక సందడి.. వీకెండ్ లుక్ ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Niharika : భర్తతో కలిసి నిహారిక సందడి.. వీకెండ్ లుక్ ఇదే

Niharika : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లైన కూడా ఆమె చేస్తున్న సంద‌డి మామ‌లుగా లేదు. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 March 2022,11:00 am

Niharika : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లైన కూడా ఆమె చేస్తున్న సంద‌డి మామ‌లుగా లేదు. వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.

నిర్మాత‌గా రాణిస్తున్న‌నిహారిక సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవ‌ల ఈ మెగా డాటర్ నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. తమకి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే తెలియచేస్తారు. మరి సడన్ గా నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డిలీట్ చేసిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలేట్ చేసే ముందు నిహారిక ఓ వీడియోని పోస్ట్ చేసింది. .ఆ వీడియోలో తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉండగా అతడు పుష్ అప్స్ చేశాడు.

niharika shares cute pic with husband

niharika shares cute pic with husband

Niharika : నిహారిక అద‌ర‌గొట్టేస్తుందిగా..!

ఈ వీడియో నిహారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ పోస్ట్ చూసి వారి అత్తగారింట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నిహారిక అత్తమామలకు ఆగ్రహం తెప్పించిందట. ఈ విషయం గురించి నిహారికతో మాట్లాడగా తను ఏకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ నే డిలీట్ చేసిందని సమాచారం. నిహారిక‌పై అత్తింట్లో ఒత్తిడి బాగానే ఎక్కువైంద‌ని, ఆమె ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఈ అమ్మ‌డు వీకెండ్ పిక్స్ అంటూ త‌న భ‌ర్త‌తో క‌లిసి దిగిన పిక్ షేర్ చేసింది. ఇది ఆకట్టుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది