Karthika Deepam : ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి!.. డాక్టర్ బాబు, వంటలక్కలు మామూలోళ్లు కాదు
Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అందరికీ తెలిసిందే. వారు ఎప్పుడూ కలిసి సంతోషంగా బతికినట్టు అనిపించింది. ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ వారిని బాధిస్తూనే ఉంటుంది. మోనిత రూపంలో డాక్టర్ బాబు, వంటలక్కలను ఎప్పుడూ చిత్రవధ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అయితే డాక్టర్ బాబు మోనిత ఓ ఆట ఆడుతోంది. కానీ వంటలక్క మాత్రం ఏదో ప్లాన్ వేసింది. బిడ్డ పుట్టడానికి సంతకం పెట్టడం, దోష నివారణ పూజలో డాక్టర్ బాబు ఉండటంతో మోనిత రెచ్చిపోతోంది.
వాటిని చూసి దీప గుండె బద్దలైనా కూడా ఏదో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తోంది. డాక్టర్ బాబు, వంటలక్కలు ఎప్పుడూ బాధలు పడుతూనే ఉంటారు. అయితే తాజాగా నిరుపమ్ తన ఇన్ స్టాలో పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో కార్తీకదీపం సెట్ నుంచి కొన్ని స్టిల్స్‌ను షేర్ చేశారు. డాక్టర్ బాబు, వంటలక్కలు ఎంత సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారో తెలుస్తోంది. ఎంత సంతోషంగా ఉన్నారో కనిపిస్తోంది. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Nirupam And Premi Viswanath From Karthika Deepam Set
Karthika Deepam : కార్తీకదీపం సెట్‌లో డాక్టర్ బాబు రచ్చ
అసలు ఇంతకీ డాక్టర్ బాబు చేసిన పోస్ట్ ఏంటో ఓ సారి చూద్దాం. షూటింగ్ గ్యాప్‌లో సెట్స్ మీద డాక్టర్ బాబు, వంటలక్కలు అలా కూర్చుని ఉన్నారు. ఓ చాక్లెట్ తినేందుకు డాక్టర్ బాబు ప్రయత్నించాడు. కానీ వంటలక్క మాత్రం ఆ చాక్లెట్ను తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ చాక్లెట్ ఏమైందో తెలియాలంటే.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ చూడండని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ చాక్లెట్‌ను వంటలక్క తినేసింది. మొత్తానికి ఇలా ఈ ఇద్దరూ సరదాగా ఉండటంతో నెటిజన్లకు తృప్తిగా ఉంది.